తమాషా క్వీన్‌ | Shraddha Kapoor biopic on Vithabai Narayangaonkar | Sakshi
Sakshi News home page

తమాషా క్వీన్‌

Jun 20 2026 1:03 AM | Updated on Jun 20 2026 1:03 AM

Shraddha Kapoor biopic on Vithabai Narayangaonkar

మహారాష్ట్రకు చెందిన సుప్రసిద్ధ జానపద నృత్య కళాకారిణి, గాయని విఠాబాయి భావూమాంగ్‌ నారాయణగాంవ్‌కర్‌ జీవితం వెండితెరపైకి రానుంది. మహారాష్ట్ర జానపద నృత్య కళ అయిన ‘లావణి’లో విఠాభాయికి అద్భుతమైన నైపుణ్యం ఉంది. ‘తమాషా’ (మహారాష్ట్ర సాంప్రదాయ జానపద కళ)లోనూ ఆమె ప్రతిభ చాటారు. అందుకే ఆమె ‘తమాషా క్వీన్‌’గా గుర్తింపు పొందారు. ఇప్పుడు విఠాబాయి ప్రస్తావన ఎందుకంటే... ఈ ప్రఖ్యాత కళాకారిణి జీవితం ‘ఈఠా’గా వెండితెరపైకి రానుంది. సిల్వర్‌ స్క్రీన్‌పై విఠాబాయిగా హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ నటిస్తున్నారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఛావా’ ఫేమ్‌ లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దినేష్‌ విజన్, లక్ష్మణ్‌ ఉటేకర్, కరిష్మా శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షాహిద్‌ కపూర్, రష్మికా మందన్నా, కృతీ సనన్‌ నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘కాక్‌టెయిల్‌ 2’ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ఇంటర్వెల్‌ సమయంలో ‘ఈఠా’ చిత్రం టీజర్‌ను ప్రదర్శించారు. ఈ టీజర్‌ను నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, ఈ విజువల్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement