90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్ | Puri Jagannadh Comments On Education in Puri Musings | Sakshi
Sakshi News home page

90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్

May 24 2026 11:49 PM | Updated on May 25 2026 5:38 AM

Puri Jagannadh Comments On Education in Puri Musings

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ తాజా ఎపిసోడ్‌లో ప్రస్తుత విద్యా విధానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' అనే అంశంపై మాట్లాడుతూ.. నేటి స్కూళ్లు పిల్లలపై అధిక ఒత్తిడి పెంచి వారిని డిప్రెషన్‌లోకి నెడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం కేవలం మార్కులు, ఎగ్జామ్స్, కాంపిటీషన్ మీద దృష్టి పెట్టి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పిల్లలకు చిన్న వయసులోనే నైతిక విలువలు,సమయపాలన, సర్వైవల్ స్కిల్స్ నేర్పాలి. అలాగే డిజిటల్ డిసిప్లిన్, మెడిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత విద్యా విధానంలో 90% మార్కులు తెచ్చుకున్నా ఆ విద్యార్థికి జీవితంలో దాని ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్, మనోస్థైర్యం, సంస్కారం నేర్పితే వారు మంచి పౌరులుగా తయారవుతారు.  

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ప్రస్తావిస్తూ.. ప్రతి సంవత్సరం 13,000–15,000 మంది విద్యార్థులు అకాడమిక్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు కంటే సంస్కారం ముఖ్యం. భవిష్యత్ విద్యావ్యవస్థ పిల్లలకు మనోస్థైర్యం, నైతిక విలువలు, స్వీయ నియంత్రణ నేర్పేలా ఉండాలని పూరీ జగన్నాథ్ కోరుకున్నారు.  

ఇక సినిమాల విషయానికి వస్తే.. పూరి-విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. దాని తరువాత సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్‌టైనర్ వస్తుందో చూడాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement