ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ రాజా శివాజీ. ఈ చిత్రంలో రితేశ్ దేశ్‌ముఖ్ హీరోగా నటించడమే కాదు.. ఆయనే దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీ మరాఠీ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా మరాఠీతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించారు. స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ సాగించిన పోరాటాన్ని ఇందులో చూపించారు. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో జెనీలియా, విద్యా బాలన్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.
Vidroh karne aa rahein hai Raje ⚔️ pic.twitter.com/1tnxMXNzGU
— Netflix India (@NetflixIndia) June 26, 2026


