కల్కి 2పై ప్రభాస్ ఫోకస్.. నాగ్ అశ్విన్ ఆసక్తికర అప్‌డేట్ | Prabhas focuses on Kalki 2: Nag Ashwin gives an interesting update | Sakshi
Sakshi News home page

కల్కి 2పై ప్రభాస్ ఫోకస్.. నాగ్ అశ్విన్ ఆసక్తికర అప్‌డేట్

Jun 6 2026 11:03 PM | Updated on Jun 6 2026 11:03 PM

Prabhas focuses on Kalki 2: Nag Ashwin gives an interesting update

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన రాజాసాబ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ప్రభాస్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలను సమాంతరంగా పూర్తి చేసే పనిలో ప్రభాస్ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి 2పై కూడా ఫోకస్ పెట్టాడు. 

తాజాగా సింగ్ గీతం సినిమా ప్రమోషన్లలో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్‌లో కల్కి 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే కల్కి 2 చిత్రీకరణ ప్రారంభమైంది. జూలై నుంచి నిరంతరాయంగా షూటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని నాగ్ అశ్విన్ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అన్నీ అనుకున్నట్టు జరిగితే కల్కి 2 చిత్రం 2027 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే నాగ్ అశ్విన్ మాత్రం దీనిపై ఎలాంటి డెడ్‌లైన్ పెట్టుకోలేదని స్పష్టం చేశారు.  

ఇక ఫౌజీ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా టీమ్‌ ప్రకటించారు. ఈ రెండు థియేటర్లలోకి వచ్చిన తర్వాతే కల్కి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాతే సలార్ 2 రానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement