ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ సెలబ్రిటీల ర్యాంకులను ప్రకటిస్తుంది. ప్రతి నెల, వారానికి సంబంధించి ఎప్పటికప్పుడు ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ వారంలో పాపులర్ సెలబ్రిటీల జాబితాను ఐఎండీబీ వెల్లడించింది. అయితే ఈసారి ఎవరు ఊహించని నటుడు నంబర్ స్థానంలో నిలిచారు. దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారూక్ ఖాన్‌ను సైతం వెనక్కి నెట్టిన ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. అతను ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి.
ఈ వారంలో టాప్‌లో నిలిచిన నటుడు యుధ్వీర్ అహ్లావత్. అతను ఇటీవలే కర్తవ్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ బాలీవుడ్ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ లిస్ట్‌లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, తలపతి విజయ్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్ లాంటి స్టార్లను అధిగమించి ఏకంగా నంబర్‌వన్ ప్లేస్ కొట్టేశాడు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు యుధ్వీర్ అహ్లావత్.. ఐఎండీబీ ర్యాంక్‌తో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. యుధ్వీర్ కర్తవ్య మూవీలో 16 ఏళ్ల హర్యానా బాలుడు హర్పాల్ పాత్ర పోషించారు.
బాలుడి పాత్రలో కనిపించడంతో యుధ్వీర్ అంతా చిన్నపిల్లాడని భావించారు. కర్తవ్యను చూస్తున్న ప్రేక్షకులు యుధ్వీర్‌ను ఒక బాలనటుడిగా గుర్తించారు. కానీ అతని వయసు అక్షరాలా 33 సంవత్సరాలు. అతను దాదాపు దశాబ్ద కాలంగా సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు ఐఎండీబీ టాప్ ర్యాంక్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు.
Catch who is trending on IMDb’s Popular Indian Celebrities list of the week! 🌟
See the complete list on the IMDb app, available on iOS and Android. 🍿
This list is powered by ‘Popular Indian Celebrities’: a weekly IMDb feature that showcases the Indian stars trending… pic.twitter.com/DHQRD5dVed— IMDb India (@IMDb_in) May 27, 2026


