'రాముడి పాత్రకు సుశాంత్‌ను మించినవారు లేరు'.. సోదరి ఎమోషనల్ | Sister Shweta Remembers Sushant Singh Rajput death anniversary | Sakshi
Sakshi News home page

Sushant Singh Rajput: 'రాముడి పాత్రకు సుశాంత్‌ ఫర్‌ఫెక్ట్'.. సోదరి ఎమోషనల్

Jun 14 2026 10:51 AM | Updated on Jun 14 2026 11:53 AM

Sister Shweta Remembers Sushant Singh Rajput death anniversary

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ను ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి గుర్తు చేసుకుంది. ఇవాళ సుశాంత్ వర్ధంతి కావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సోదరుడిని గుర్తు చేసుకుని ఎమోషనలైంది. కాలం గడిచినా తన సోదరుడి ఉనికి ఇంకా తమతోనే ఉందని శ్వేత రాసుకొచ్చింది. నువ్వు లేకుండా ఆరేళ్లయినా నువ్వు జీవించిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సుశాంత్‌ శ్రీరాముడిలా ఉన్న ఏఐ ఫోటోను షేర్ చేసింది.

శ్వేత తన ఇన్‌స్టాలో రాస్తూ.. "ఆరేళ్ల కాలం గడిచిపోయింది.. అయినా కొన్ని ఆత్మలు కాలానికి అతీతంగా ఎదుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అతను ఎలా మరణించాడో కాకుండా.. ఎలా జీవించాడో గుర్తుంచుకోవాలనుకన్నా.. అతను జిజ్ఞాస, కరుణ, గౌరవంతో నిండిన వ్యక్తి' అని అభివర్ణించారు. ఎవరైనా సరే చాలా గౌరవించేవాడని శ్వేత తెలిపింది. కరుణ, దయ లేకపోతే విజయానికి అర్థం లేదని తన చుట్టూ ఉన్నవారికి నేర్పించాడని ఆమె రాసుకొచ్చారు. అందుకే తన సోదరుడు జీవితమే తనకు ఆదర్శమని ఆమె అన్నారు. 

రాముడిలా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..

నితేష్ తివారీ రామాయణం టీజర్ విడుదలైన తర్వాత.. సుశాంత్‌ను శ్రీరాముడిగా ఊహించకున్నానని తెలిపింది. రాముడు కేవలం వ్యక్తి మాత్రమే కాదని.. ఆయన అమూల్యంగా భావించే విలువలకు ప్రతీక అని పేర్కొంది. మర్యాద, కరుణ, గౌరవం, ధైర్యం, సత్యం సీతామాతపై ఆయనకున్న స్వచ్ఛమైన ప్రేమ రాముడి పాత్రకు సంబంధించిన అమాయకత్వం, స్వచ్ఛత, ఔన్నత్యం సుశాంత్‌ కనిపించాయని అన్నారు.  ఈ రోజుల్లో భాయ్ పోషించినంత అద్భుతంగా రాముడి పాత్రను ఎవరూ పోషించలేరని కూడా శ్వేత అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement