మీరు మాత్రం ఆ పని చేయొద్దు: తాప్సీ వార్నింగ్‌ | Taapsee Pannu Warning about Workouts for Lower Belly Fat | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: నన్ను నేను టార్చర్‌ పెట్టుకున్నా.. మీరలాంటివి చేయొద్దు!

Jun 1 2026 2:50 PM | Updated on Jun 1 2026 3:14 PM

Taapsee Pannu Warning about Workouts for Lower Belly Fat

సౌత్‌లో స్టార్‌ స్టేటస్‌ అందుకుని నార్త్‌లో సెటిలైపోయిన హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. వరుసగా హిందీ సినిమాలే చేస్తోంది. తాజాగా తాప్సీ తాను గతంలో ఓ తప్పు చేశానని, అలాంటి తప్పు ఇంకెవరూ చేయకూడదని సుతిమెత్తగా హెచ్చరిస్తోంది.

ఫ్లాట్‌గా ఉండే నడుము కోసం..
ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తాప్సీ ఓ పోస్ట్‌ పెట్టింది. 'నాకు నాజూకైన నడుము కావాలని చిన్నప్పటినుంచే అనుకునేదాన్ని. కొంచెం కూడా పొట్ట పైకి కనిపించకూడదని కోరుకునేదాన్ని. అంతా ఓకే కానీ, నడుము కింది భాగంలో కొవ్వు పేరుకుపోయి ఉండేది. ఈ లోయర్‌ బెల్లీ ఫ్యాట్‌ ఎందుకు వచ్చిందనేది అస్సలు అర్థమయ్యేది కాదు. దాన్ని తగ్గించుకోవడం కోసం ఎక్కువ వ్యాయామాలు చేశాను. సామర్థ్యానికి మించి వ్యాయామం చేసినప్పుడు నా శరీరం మెదడుకు హెచ్చరికలు పంపేది.

అది కొవ్వు మాత్రమే కాదు
శరీరం నుంచి నీరు బయటకు వచ్చేయడానికి బదులు దాన్ని నిల్వ ఉంచుకోవడం మొదలుపెడుతుంది. బెల్లీ ఫ్యాట్‌ అంటే అక్కడ కొవ్వు పేరుకుపోవడం మాత్రమే కాదు, కొందరిలో కొవ్వుకు బదులుగా నీళ్లు నిల్వ ఉంటాయి. వర్కవుట్స్‌ ఎక్కువ చేస్తే ఆ బెల్లీ ఫ్యాట్‌ తగ్గడం కాదు కదా.. మరింత పెరుగుతుంది. కాబట్టి నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దని చెప్తున్నాను.

శరీరాన్ని హింసించకండి
ప్రతి మహిళకు భిన్నమైన శరీరం ఉంటుంది. హార్మోన్ల మార్పుల వల్ల మన శరీరం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. దాన్ని మీరు ఒప్పుకునే తీరాలి. నన్ను నేను చాలా టార్చర్‌ పెట్టుకున్న తర్వాత ఆలస్యంగా ఈ విషయం అర్థం చేసుకున్నాను. మా డాక్టర్‌ ఏం చెప్పిందంటే.. పొట్ట కింద కొద్దిగా కొవ్వు, నీరు నిల్వ ఉండటం అవసరమని తెలిపింది. 

ఆరోగ్యానికి మంచిదే
అక్కడున్న అవయవాలకు అవి రక్షణగా పని చేస్తాయంది. కాబట్టి ప్రతి మహిళకు లోయర్‌ బెల్లీ ఫ్యాట్‌ ఉండటం మంచిదే! సోషల్‌ మీడియాలో దిగే ఫోటోల కోసం మీ శరీరాన్ని మీరు హింసించుకోకండి. కొంచెం కొవ్వు ఆరోగ్యానికి మంచిదేనని భావించండి' అని రాసుకొచ్చింది. తాప్సీ చివరగా 'అస్సి' సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీలో రెండు మూవీస్‌ చేస్తోంది.

చదవండి: నా గర్భస్రావానికి సీఎం విజయ్‌నే కారణం: బుల్లితెర నటి

Advertisement
 
Advertisement
Advertisement