నా గర్భస్రావానికి సీఎం విజయ్‌నే కారణం: బుల్లితెర నటి | Actress Julie: Vijay anna is responsible for my Miscarriage | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌ వల్లే కడుపులో బిడ్డను కోల్పోయా.. క్షోభ అనుభవిస్తున్నా..: నటి

Jun 1 2026 11:09 AM | Updated on Jun 1 2026 11:26 AM

Actress Julie: Vijay anna is responsible for my Miscarriage

తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా పాపులర్‌ అయిన బుల్లితెర నటి జూలీకి హీరో విజయ్‌ అంటే గిట్టదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన్ను విమర్శిస్తూ ప్రచారం చేసింది. విజయ్‌కు వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్‌లో అనుమతి లేకుండా నిరసన తెలిపి వివాదంలో చిక్కుకుంది. అయితే దళపతి అభిమానులు, తమిళ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తల ట్రోలింగ్‌ వల్ల తాను నరకయాతన అనుభవించానంటోంది జూలీ. 

ట్రోలింగ్‌..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూలీ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ తట్టుకోలేకపోతున్నాను. నన్ను దారుణంగా విమర్శించిన కొందరి పేర్ల వివరాలతో సహా మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు చూస్తే రివర్స్‌లో నాపైనే రూ.15 లక్షల కిడ్నీ స్కామ్‌ ఆరోపణలు చేస్తున్నారు. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారు.

గర్భస్రావానికి ఆయనే కారణం
మరోవైపు వీళ్ల ట్రోలింగ్‌ వల్ల నాకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. కడుపులో బిడ్డను కూడా కోల్పోయాను. నా గర్భస్రావానికి సీఎం విజయ్‌ అన్నయే కారణం. ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఆయన హస్తం ఉంది. నన్ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నవారిని ఒక్క మాట చెప్పి అదుపు చేసుంటే నేను నా బిడ్డను కోల్పోయేదాన్నే కాదు.

ప్రజలపై దృష్టి పెట్టండి
నన్ను, నా భర్తను అనరాని మాటలంటున్నారు. మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక మహిళ జీవితాన్నే నాశనం చేస్తారా? సోషల్‌ మీడియా వల్లే విజయ్‌ ముఖ్యమంత్రి అయ్యాడని అంటున్నారు కదా.. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై దాడులు చేయించడానికి బదులుగా ప్రజల కోసం ఏం చేయాలన్నదానిపై దృష్టి పెడితే బాగుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది అనైతికం
జూలీ కామెంట్స్‌పై నటి అంబిక అసహనం వ్యక్తం చేసింది. ప్రెగ్నెన్సీ విషయంలో నీకు జరిగినదానికి చింతిస్తున్నాను. కానీ నువ్వు చెప్పేది అనైతికంగా ఉంది. నీ గర్భస్రావానికి సీఎం విజయ్‌ ఎలా కారణమవుతాడు? ముందు నీ మాట తీరు మార్చుకో.. సీఎం, పీఎసం స్థానంలో ఉన్నవారిని ఎలా గౌరవించాలో నేర్చుకో అని చురకలంటించింది.

బుల్లితెర
కాగా జూలీ తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ అల్టిమేట్‌ షోలోనూ పార్టిసిపేట్‌ చేసింది. ఒడి విలయదు పాప అనే షోకి వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. నాన్‌ సిరితల్‌ చిత్రంలో యాక్ట్‌ చేసింది. ఈ ఏడాది జనవరిలో మొహ్మద్‌ ఇక్రీమ్‌ను పెళ్లాడింది.

చదవండి: హీరోయిన్‌ కాజల్‌కు ఎంత కష్టమొచ్చింది?

Advertisement
 
Advertisement
Advertisement