కాజల్‌కు ఎంత కష్టమొచ్చింది? | Actress Kajal Aggarwal Photoshoot for Movie Chances | Sakshi
Sakshi News home page

కాజల్‌ వరుస ఫోటోషూట్స్‌.. దానికోసమే ఇదంతా?

Jun 1 2026 9:07 AM | Updated on Jun 1 2026 7:36 PM

Actress Kajal Aggarwal Photoshoot for Movie Chances

ఒక్కసారి డౌన్‌ అయితే మళ్లీ పైకి లేవడానికి సమయం పడుతుంది. ఒక్కోసారి అది కూడా జరగకపోవచ్చు. నయనతార వంటి సీనియర్‌ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ లెగసీని కొనసాగిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ వంటి కొందరు మాత్రం కెరీర్‌ పరంగా కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. కాజల్‌ ఇంతకుముందు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో జతకట్టిన ఈ ఉత్తరాది భామ 2020లో గౌతమ్‌ కిచ్లును పెళ్లాడింది. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. 

స్లిమ్‌ అయిన కాజల్‌
ఆ సమయంలో సినిమాలకు కొంత విరామం ఇచ్చిన కాజల్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ బిజీ అవాలని చూస్తోంది. అందుకే అనేక కసరత్తులు చేస్తూ స్లిమ్‌ అయిపోయింది. అయితే అవకాశాలు అరుదుగా వస్తున్నప్పటికీ గుర్తింపయితే రావట్లేదు. ఏడాదికి ఒకటి రెండు చిత్రాల్లోనే నటిస్తోంది కానీ బిజీగా మాత్రం లేదు. హిందీలో రామాయణం, ద ఇండియా స్టోరి మూవీస్‌ చేస్తోంది. కమల్‌ హాసన్‌ ఇండియన్‌ 3 ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని పరిస్థితి. 

అందుకోసమే కసరత్తులు
తాజాగా ఈ బ్యూటీ ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే పూర్వవైభవాన్ని పొందాలని తహతహలాడుతున్న ఈ బ్యూటీ తనను తాను ప్రచారం చేసుకునే పనిలో పడింది. గతకొద్దిరోజులుగా ప్రతిరోజూ ఫోటోషూట్‌ చేస్తూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. అవి నెట్టింట వైరలవుతుండగా అవకాశాల కోసమే ఈ ఫోటో సెషన్‌ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి తన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందో? లేదో? చూడాలి!

చదవండి: ప్రముఖ గాయని సుమన్‌ ఇక లేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement