సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఛావా నటి బలవన్మరణం | Kumkum Bhagya Actor Sanchita Ugale Commits Suicide In Mumbai, Fans Heartbroken Over Sudden Death | Sakshi
Sakshi News home page

Sanchita Ugale: రీల్ చేస్తూ డ్యాన్స్.. అంతలోనే ఏమైంది?

Jun 15 2026 2:26 PM | Updated on Jun 15 2026 5:21 PM

Kumkum Bhagya actor Sanchita Ugale commits suicide in Mumbai

ప్రముఖ బుల్లితెర నటి సంచితా ఉగలే(22) బలవన్మరణానికి పాల్పడింది. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించిన ఆమె ముంబయిలోని తన నివాసంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకుంది. ఆమె చివరిసారిగా ఓ రీల్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఆమె మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంచితా హిందీలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు.  'కుంకుమ్ భాగ్య', 'సాజన్ ఘర్', 'దిల్వాలీ దుల్హా లే జాయేగీ' లో కనిపించారు. టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కుంకుమ్ భాగ్య' సీరియల్‌లో దియా టాండన్ పాత్రకు ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా 'వాగ్లే కి దునియా' సీరియల్‌లో రుచితా.. జైట్లీ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత  'దిల్వాలీ దుల్హా లే జాయేగీ'లో సోరబ్ బేడీ సరసన సుకూన్ అనే ప్రధాన పాత్రను పోషించింది. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' మూవీలో ఆమె తారాబాయి పాత్రలో మెరిసింది.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement