ప్రముఖ బుల్లితెర జంట విడాకులు | Actress Akanksha Chamola confirms divorce from Gaurav Khanna | Sakshi
Sakshi News home page

Akanksha Chamola: 'అవును.. విడాకులు తీసుకుంటున్నాం': బుల్లితెర నటి

Jun 28 2026 10:31 AM | Updated on Jun 28 2026 10:43 AM

Actress Akanksha Chamola confirms divorce from Gaurav Khanna

సినీ ఇండస్ట్రీలోనే విడాకులు పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల కోలీవుడ్‌ స్టార్స్ విజయ్, జయం రవి లాంటి వాళ్లు విడాకుల కేసులతో వార్తల్లో నిలిచారు. సినిమా రంగంలోనే ఎక్కువగా ఇలాంటి వార్తలొస్తున్నాయి. తాజాగా మరో స్టార్ జంట విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ప్రముఖ బాలీవుడ్ జంట గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నటి ఆకాంక్ష తాజాగా లాక్ అప్‌ సీజన్‌-2 ప్రీమియర్‌లో అఫీషియల్‌గా చెప్పేసింది. గతేడాదిగా తాము విడివిడిగా ఉంటున్నామని.. ఇప్పుడు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఆమె వెల్లడించింది.

ఈ విషయాన్ని 'లాక్ అప్ సీజన్ 2' ప్రీమియర్‌లో ఆకాంక్ష ధృవీకరించింది. గత ఏడాదిగా తాము విడివిడిగా ఉంటున్నామని, ఇప్పుడు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఆమె అక్కడ వెల్లడించింది. దీంతో 10 ఏళ్ల వివాహ బంధం తర్వాత గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా విడాకులు తీసుకోబోతున్నారు.

ఈ రియాలిటీ షోలో  ఆకాంక్ష మాట్లాడుతూ.. "నేను, గౌరవ్ విడాకులు తీసుకుంటున్నాం. మేము గతేడాదిగా విడివిడిగానే ఉంటున్నాం. ఈ విషయం బయటికి చెప్పలేదు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. నాకు, గౌరవ్‌కు మధ్య పరిస్థితులు బాగానే ఉన్నాయి. మేము ఇప్పటికీ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాం. భాగస్వాములుగా మేము ఒకరికొకరు సెట్ కాలేదని అనుకుంటున్నాం., ఎందుకంటే మేమిద్దరం చాలా భిన్నమైన ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాం. కానీ మేమిద్దరం కలిసి కాదు" అని విడాకులపై తేల్చేసింది. కాగా.. గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా చాలా ఏళ్ల ప్రే తర్వాత నవంబర్ 24, 2016న కాన్పూర్‌లో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరిద్దరు బాలీవుడ్‌ సీరియల్స్‌లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement