‘డ్రాగన్‌’ గ్లింప్స్‌ రిలీజ్‌.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పవర్‌ఫుల్‌ ట్రీట్‌ | NTR Dragon Movie Glimpse release is a powerful treat for fans | Sakshi
Sakshi News home page

‘డ్రాగన్‌’ గ్లింప్స్‌ రిలీజ్‌.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పవర్‌ఫుల్‌ ట్రీట్‌

May 20 2026 12:24 AM | Updated on May 20 2026 12:54 AM

NTR Dragon Movie Glimpse release is a powerful treat for fans

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూ.ఎన్టీఆర్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లింప్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ మొత్తం సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందనే క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, తన మార్క్ ఏమాత్రం తగ్గకుండానే ఈ గ్లింప్స్ కట్ చేశాడు.

ఇక తారక్‌ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి 11.30 గంటల తర్వాత డ్రాగన్ సినిమా గ్లింప్స్ వచ్చింది. 4.28 నిమిషాల నిడివి గల ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్‌ స్లిమ్‌ లుక్‌ ఆకట్టుకుంది. సింపుల్‌గా సినిమా కథ, ఆ ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ గ్లింప్స్‌లో తారక్‌ చెప్పిన డైలాగ్స్‌ అభిమానులను అలరించేలా ఉన్నాయి. విజువల్స్‌ చాలా రిచ్‌గా ఉన్నాయి. రవి బస్రూర్‌ అందించిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్‌ అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. పవర్‌ఫుల్‌గా సాగిన ఈ గ్లింప్స్‌ సినిమా మీద భారీ అంచనాలను రేపుతోంది.


కాగా డ్రాగన్ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్‌ షెడ్యూల్‌లు వరుసగా వాయిదాలు పడటంతో విడుదలను వాయిదాలు పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు డ్రాగన్ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కీలకమైన  పాత్రలో అనిల్‌ కపూర్‌ నటిస్తున్నారు. కథను మలుపు తిప్పే మరో లీడ్‌ రోల్‌లో నటించనున్నారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, కాజోల్‌... వంటి వార్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా భట్‌ పేరు తెరపైకి వచ్చింది. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్‌ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌ను మీరు కూడా చూసేయండి.

Advertisement
 
Advertisement
Advertisement