రోడ్డు ప్రమాదంలొ ప్రముఖ టీవీ నటుడు దుర్మరణం, సీఎం సంతాపం | Marathi actor Mahesh Pawar tragedy CM Devendra Fadnavis reacts | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలొ ప్రముఖ టీవీ నటుడు దుర్మరణం, సీఎం సంతాపం

May 28 2026 6:03 PM | Updated on May 28 2026 6:28 PM

Marathi actor Mahesh Pawar tragedy CM Devendra Fadnavis reacts

ఒకరు ప్రముఖ  మరాఠీ టీవీ నటుడు ఏళ్ల నటుడు మహేష్ పవార్ (25) ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వారు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ (SUV) వాహనం దాదాపు 1,000 అడుగుల లోతునున్న లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహేష్ పవార్‌తో పాటు ప్రయాణిస్తున్న మరో ఏడుగురు కూడా అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. దీంతో  పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ముంబైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాడ్‌పూర్-మహాబలేశ్వర్ రోడ్డులోని అంబెనాలి ఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పీటీఐ (PTI) నివేదించింది. కొండల మధ్య ఉన్న ఈ ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. బాధితుల చివరి మొబైల్ లొకేషన్ ఆధారంగా,  అంబెనాలి ఘాట్ విభాగంలో పోలీసులు శోధించగా, లోయలో పడి ఉన్న వాహనాన్ని గుర్తించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.

బాధితులు ఎవరు?
పోలీసుల సమాచారం ప్రకారం.. మరణించిన వారంతా 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు. వీరంతా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాపోలిలోని హర్నే నుండి బయలుదేరారు. అయితే వారు గమ్యస్థానమైన సతారాకు చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

మృతులను సతారాకు చెందిన రితేష్ లోఖండే (22), సుహాస్ లోఖండే (20), ఉత్కర్ష్ షింగ్తే (21), నిఖిల్ షింగ్తే (25), మహేష్ పవార్ (25), ఆదిత్య సాలుంఖే (21), రాజేష్ కట్కర్ (35)  రత్నగిరికి చెందిన అన్ష్ చవాన్ (19)లుగా అధికారులు గుర్తించారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం
ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను "యుద్ధప్రాతిపదికన" నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది మంది స్నేహితులు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతదేహాలను వెలికితీసేందుకు జిల్లా యంత్రాంగం వెంటనే ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిందని సీఎం పేర్కొన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) , స్వచ్ఛంద రెస్క్యూ టీమ్‌ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మహేష్ పవార్ ప్రముఖ మరాఠీ టెలివిజన్ షో 'అప్పి ఆమ్చీ కలెక్టర్' లో తన నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అకాల మరణం మరాఠీ చిత్ర పరిశ్రమను ,ఆ సీరియల్ ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement