హీరోయిన్ పనివాళ్ల కోసం రూ.51 కోట్ల విలువైన ఫ్లాట్స్? | Sonam Kapoor 5 Flats Issue Full Details | Sakshi
Sakshi News home page

Sonam Kapoor: హీరోయిన్‌పై లండన్‌లో వ్యతిరేకత.. అసలేం జరిగింది?

May 24 2026 9:14 PM | Updated on May 24 2026 9:22 PM

Sonam Kapoor 5 Flats Issue Full Details

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది. భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్‌లో ఉంటోంది. అయితే ఈమె తన పనివాళ్ల కోసం రూ.51 కోట్లు విలువ చేసే ఐదు ఫ్లాట్స్ కొనుగోలు చేసిందనే వార్త నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది. ఇవి కొన్నందుకే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా ఎదురైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి గొడవ?

(ఇదీ చదవండి: ఆస్కార్‌లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్.. మూవీ రివ్యూ)

వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ సోనమ్ కపూర్.. లండన్‌లో ఉంటోంది. అక్కడ నాటింగ్‌హిల్‌లో మూడేళ్ల క్రితం రూ.270 కోట్ల విలువైన మ్యాన్షన్‌ని కొనుగోలు చేసిన ఈ జంట.. ఇంటి లోపల భారీ మార్పులు చేసుకున్నారని, స్మిమ్మింగ్ పూల్, బాస్కెట్ బాల్ కోర్టు లాంటి వాటి కోసం రూ.50 కోట్ల మేర ఖర్చు చేశారని టాక్.

ఇకపోతే ఈ మ్యాన్షన్‌కి సమీపంలోనే మరో ఐదు ఫ్లాట్స్‌ని సోనమ్ కపూర్ దంపతులు కొన్నారని, ఇవి వాళ్ల పనివాళ్ల కోసమే ఉపయోగించుకుంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొనుగోళ్ల ద్వారా భవన నిర్వహణ కమిటీపై పట్టు సాధించి, తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సోనమ్ దంపతులపై పోస్టులు పెడుతున్నారు.

ఇలా వ్యవహారం కాస్త బయటకు రావడంతో సోనమ్ కపూర్ ప్రతినిధి దీనిపై స్పందించారు. ఆ ఫ్లాట్లని పెట్టుబడిలో భాగంగానే కొనుగోలు చేశారని.. దీనికి సోనమ్‌కి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయితే లండన్ లో స్థానికుల కంటే భారతీయులే ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి.

(ఇదీ చదవండి: సీఎం విజయ్ చివరి సినిమాకు ఎట్టకేలకు మోక్షం?)

Advertisement
 
Advertisement
Advertisement