కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు | Kajal Aggarwal About Her Son Future Films | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలు మాత్రమే చేస్తా

Jul 7 2026 2:48 PM | Updated on Jul 7 2026 2:56 PM

Kajal Aggarwal About Her Son Future Films

హీరోయిన్ కాజల్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. చాన్నాళ్లుగా తెలుగులో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ కొత్త మూవీతో బిజీగా ఉంది. ఈమె నటించిన 'ద ఇండియన్ స్టోరీ' విడుదలకు సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తను చేయబోయే మూవీస్ విషయంలో ఎలాంటి మార్పు వచ్చిందనేది బయటపెట్టింది.

(ఇదీ చదవండి: నా ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నా.. టాలీవుడ్ హీరోయిన్)

'ఇప్పుడు ఏ మూవీ ఓకే చేసినా నా కొడుకు దృష్టి నుంచి ఆలోచిస్తాను. 'మమ్మా చేసిన గ్రేట్ సినిమా ఇది' అని అతడు గర్వంగా చెప్పుకోవాలి. అందుకే ఎలాంటి చిత్రాలు చేయాలి? అనే విషయంపై నాకు ఎక్కువ బాధ్యత, అవగాహన వచ్చాయి. నీల్‌కి రామాయణం అంటే ఇష్టం. ఇంట్లో రోజూ రామ్ లీలా చూస్తాడు. నేను 'రామాయణ'లో మండోదరిగా నటిస్తున్నానని చెప్పగానే తెగ ఆనందపడ్డాడు. అతడికి ఇష్టమైన పాత్ర రావణుడు. ఈ మూవీ పార్ట్2 వచ్చేసరికి నీల్‌కి ఐదేళ్లు వస్తాయి. థియేటర్‌లో నా కొడుకు చూసే తొలి సినిమా ఇదే అవుతుంది' అని కాజల్ చెప్పుకొచ్చింది.

లక్ష‍్మీ కల్యాణం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. తర్వాత యంగ్, స్టార్ హీరోలు అందరితోనూ దాదాపుగా నటించింది. కొన్నేళ్లపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అనంతరం మళ్లీ అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది.

(ఇదీ చదవండి: 15 సినిమాలతో బిజీ.. కానీ అలాంటి పాత్రలు చేయట్లేదు: బాబుమోహన్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement