తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎప్పటికప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు దర్శించుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తెలుగు సీనియర్ కమెడియన్ బాబు మోహన్.. స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దర్శనం గురించి, చేస్తున్న కొత్త మూవీస్ గురించి మాట్లాడారు.
(ఇదీ చదవండి: నా ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నా.. టాలీవుడ్ హీరోయిన్)
'గతంలో నా వల్ల భక్తులకు ఇబ్బంది అవుతుందని తెలిసి స్వామిని దర్శించుకోవడం తగ్గించేశాను. కానీ నిన్నటివరకు దగ్గరలోనే షూటింగ్ జరిగింది. అది పూర్తయిపోగానే స్వామిని దర్శించుకోవాలని అనుకున్నా. ఈ రోజు అది జరిగింది. ప్రస్తుతం 15 సినిమాలు చేస్తున్నాను. వాటిలో కచ్చితంగా నాలుగైదు ఇరగదీస్తాయి. అయితే అప్పటిలాగా 'అన్నా..' అనే లాంటి క్యారెక్టర్లు ఇప్పుడు చేయడం లేదు. నా చివరి శ్వాస వరకు నటిస్తూ, ప్రేక్షకులని నవ్వించాలని ఆ భగవంతుడిని కోరుకున్నాను' అని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: పలు దేశాల్లో నిషేధించిన వివాదాస్పద సినిమా.. తెలుగు రివ్యూ)


