లక్ష ఆఫర్‌.. కమిట్‌మెంట్‌ అడిగారు: ప్రముఖ నటి | Maanvi Gagroo recalls being offered Rs 1 lakh to compromise early career | Sakshi
Sakshi News home page

Maanvi Gagroo: 'లక్షతో పాటు కాంప్రమైజ్ అడిగారు'

Jun 19 2026 10:50 AM | Updated on Jun 19 2026 11:01 AM

Maanvi Gagroo recalls being offered Rs 1 lakh to compromise early career

సినీ ఇండస్ట్రీలో కామన్‌గా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకునే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఈ అనుభవం ఎదుర్కొనే ఉంటారు. ఈ విషయాన్ని కొందరు బయటికి చెబితే.. మరికొందరు లైట్ తీసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాన్ని తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే సమయంలో కాంప్రమైజ్ అడిగారని గుర్తు చేసుకుంది. ఒప్పుకుంటే రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేశారని వెల్లడించింది. అందుకే బయటి వారికి బాలీవుడ్ ఎంత కష్టమో ఈ సంఘటనే సాక్ష్యమని ఆమె అన్నారు. అప్పట్లో కాంప్రమైజ్ అనే పదానికి తనకు అర్థం తెలియదని పేర్కొంది.

సినిమా ఆఫర్ కోసం ఒక రోజు ఒక వ్యక్తి నుంచి తన ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని తెలిపింది. అందులో రూ. 1 లక్ష ప్లస్ కాంప్రమైజ్ అని రాసి ఉందని పేర్కొంది. కానీ అప్పట్లో ఇండస్ట్రీకి కొత్త కావడం వల్ల కాంప్రమైజ్‌కు అర్థం తెలియక...కాంప్రమైజ్ అంటే ఏంటి?’ అని రిప్లై కూడా ఇచ్చానని వివరించింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తన  కాస్టింగ్ డైరెక్టర్‌కు చూపించగా.. అతను వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, మెసేజ్ డిలీట్ చేయమని చెప్పాడని తెలిపింది.

కాగా.. మాన్వీ గాగ్రూ.. పీకే, ఉజ్దా చమాన్‌, శుభ్‌ మంగళ్‌ జ్యాద సావధాన్‌, ఆమ్రాస్‌: ద స్వీట్‌ టేస్ట్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌, ఎ క్వశ్చన్‌ మార్క్‌, గాయ్‌ ఇన్‌ ద స్కై, ఉజ్దా చామన్‌, 377 అబ్‌నార్మల్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌, పిచర్స్‌, ట్రిప్లింగ్స్‌, తామశ్రీ వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ కనిపించింది. ఆమె 2023లో కమెడియన్‌ కుమార్‌ వరుణ్‌ను పెళ్లాడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement