మెడలో నల్లపూసల దండ.. చేతికి మట్టిగాజులు.. కంగనా షాకివ్వనుందా? | Kangana Ranaut Sparks Wedding Rumours After Viral Video Shows Her Wearing Mangalsutra And Traditional Bangles | Sakshi
Sakshi News home page

Kangana Ranaut : మెడలో నల్లపూసల దండ.. కంగనా పెళ్లి చేసుకుందా?

May 22 2026 1:28 PM | Updated on May 22 2026 4:51 PM

Kangana Ranaut wearing a mangalsutra in Video goes viral

బాలీవుడ్ ‍ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కంగనా రనౌత్. కేవలం సినిమాలే కాదు.. రాజకీయాల్లోనూ రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ బాలీవుడ్ భామకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఆమె మెడలో నల్లపూసలు, చేతులకు మట్టిగాజులు ఉండడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. కంగనా ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? అని తెగ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ భిన్నంగా స్పందిస్తున్నారు. కంగన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా? అని ఒకరు కామెంట్‌ చేయగా.. ఒకవేళ ఆమె  పెళ్లి చేసుకుంటే గ్రాండ్‌గానే చేసుకుంటారని మరొకరు రాసుకొచ్చారు. అయితే ఏదైనా సినిమా షూటింగ్‌ కోసం అలా వేసుకున్నారా? మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కంగనా నల్లపూసల దండ, మట్టిగాజులతో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ పెళ్లి గురించి చర్చ ఆగేలా కనిపించడం లేదు.

ఇక కంగనా సినిమాల విషయానికొస్తే తన సూపర్‌ హిట్‌ చిత్రం ‘క్వీన్‌’ సీక్వెల్‌లో నటిస్తున్నారు. ‘క్వీన్‌ 2’ అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని క్యారెక్టర్ లుక్ కోసమే ఆమె ఇలా తయారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న కంగనా..  మళ్లీ బాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement