సరదా సరదాగా... | Cocktail 2 star Shahid Kapoor drops cheerful monochrome BTS with Rashmika Mandanna and Kriti Sanon | Sakshi
Sakshi News home page

సరదా సరదాగా...

Jun 1 2026 4:44 AM | Updated on Jun 1 2026 4:44 AM

Cocktail 2 star Shahid Kapoor drops cheerful monochrome BTS with Rashmika Mandanna and Kriti Sanon

షాహిద్‌ చేసిన కామెడీకి నవ్వుతున్న రష్మిక, కృతి

సరదాగా ఆటపట్టించడం అంటాం కదా... షాహిద్‌ కపూర్‌–రష్మికా మందన్నా మధ్య అలాంటి సంఘటనే జరిగింది. షాహిద్‌ కపూర్‌ హీరోగా రష్మికా మందన్నా, కృతి  సనన్‌ హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘కాక్‌టెయిల్‌ 2’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో  పాల్గొంటోంది ఈ టీమ్‌. ఆ మధ్య ఒక కార్యక్రమంలో ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో షాహిద్‌ కపూర్‌ అనుకోకుండా రష్మిక భుజంపై చేయి వేశారు.

అయితే రష్మిక కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అయినట్లు వెనక్కి జరిగి, అతని చేతిని తప్పించారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన ఒక ప్రమోషనల్‌ ఈవెంట్‌లో షాహిద్, రష్మిక, కృతి  పాల్గొన్నారు. ముగ్గురూ కలిసి ఫొటోలకు పోజులిస్తున్నప్పుడు రష్మికను సరదాగా ఆట పట్టిస్తూ షాహిద్‌ కావాలని కాస్త దూరంగా జరిగారు. గత ఈవెంట్‌లో రష్మిక ఎలా అయితే చేశారో షాహిద్‌ అచ్చంగా అలానే అనుకరించడం చాలా ఫన్నీగా కనిపించింది. అయితే షాహిద్‌ దూరం జరగ్గానే అతనితో  పాటు రష్మిక, కృతి సరదాగా నవ్వేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement