రెండో కుమారుడి నామకరణం.. పేరు రివీల్ చేసిన హీరోయిన్ | Sonam Kapoor and Anand Ahuja reveal second son name | Sakshi
Sakshi News home page

Sonam Kapoor: రెండో కుమారుడి నామకరణం.. ఏ పేరు పెట్టారంటే?

May 10 2026 10:27 AM | Updated on May 10 2026 12:00 PM

Sonam Kapoor  and Anand Ahuja reveal second son name

బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ఇటీవలే రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఏప్రిల్ 29న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌ చెప్పింది. తనకు రెండోసారి కుమారుడు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇప్పటికే ఆమెకు వాయి కపూర్ అహుజా అనే బాబు ఉన్నారు. తాజాగా తన రెండో కుమారుడి నామకరణ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా తన కుమారుడి పేరు రివీల్ చేసింది.

తన రెండో కుమారుడికి రుద్రలోఖ్ కపూర్ అహుజా అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పేరుకు తన అన్నయ్య వాయుతో కలిసి వేదపరమైన రిలేషన్ ఉందని పేర్కొంది. ఈ పేరు వెనుక లోతైన, ఆధ్యాత్మిక అర్థం ఉందని తెలిపారు. రుద్ర అంటే మెరుపు, శ్వాస, స్వస్థత, పునరుద్ధరణతో ముడిపడి ఉన్న ఒక శక్తివంతమైన, పరివర్తన శక్తికి ప్రతీక అని సోనమ్ అన్నారు.. వాయువు జీవశక్తికి ప్రతీక కాగా.. రుద్ర శక్తికి, పరివర్తనకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. కాగా.. 2018లో వివాహం చేసుకున్న ఆనంద్ ఆహుజాను సోనమ్ కపూర్ పెళ్లాడింది. వీరిలో 2022లో మొదటి బిడ్డ జన్మించాడు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement