మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడే అదే పేరుతో మూవీ రానుంది. మీర్జాపూర్: ది మూవీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మీర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన ‘గద్దీ’, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పోస్టర్లు మిర్జాపూర్ యూనివర్స్‌లోని అధికారం, వారసత్వం, ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి.
తాజాగా పోస్టర్ల విడుదలతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మీర్జాపూర్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాత్రలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా.. పునీత్ కృష్ణ కథ అందించారు. ఈ మూవీని రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగు భాషలోనూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


