సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అనేది ఎంత సాధారణమో.. విడాకులు అంతే కామన్‌గా కనిపిస్తుంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు హీరో లేదా హీరోయిన్లు.. పట్టుమని కొన్నేళ్లయినా సంసార బంధాన్ని నిలుపుకోలేకపోతున్నారు. ఇప్పుడు అలానే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)
'నాగిని' సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మౌనీరాయ్.. హిందీ, పంజాబీ భాషల్లో హీరోయిన్, విలనీ పాత్రలు చేస్తూ వస్తోంది. లేటెస్ట్‌గా అయితే చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది. ఓ హిందీ మూవీ కూడా రిలీజ్‌కి రెడీగా ఉంది. కెరీర్ పరంగా కాస్తోకూస్తో బిజీగా ఉన్న ఈమెనే ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందని మాట్లాడుకుంటున్నారు. భర్తని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే ఈ రూమర్స్‌కి కారణం.
సూరజ్ నంబియార్ అనే దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్‌ని 2022 జనవరిలో మౌనీరాయ్ పెళ్లి చేసుకుంది. మలయాళీ, బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది. మరి ఏమైందో ఏమో ఇప్పుడు ఒకరిని ఒకరు ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకున్నారు. మౌనీ రాయ్ స్నేహితురాలు, హీరోయిన్ దిశా పటానీ కూడా సూరజ్‌ని అన్ ఫాలో చేసింది. పెళ్లి ఫొటోలని సూరజ్ తన అకౌంట్ నుంచి తీసేసినప్పటికీ.. మౌనీ రాయ్ మాత్రం అలానే ఉంచింది. ఈ విషయంపై మౌనీ క్లారిటీ ఇస్తే నిజాలు బయటకు రావు.
(ఇదీ చదవండి: 'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు)


