అందుకే ఛావా రిజెక్ట్‌ చేశా: బాలీవుడ్‌ నటుడు | Randeep Hooda reveals Reason why he refused Aurangzeb Role in Chhaava | Sakshi
Sakshi News home page

Randeep Hooda: ఔరంగజేబు పాత్ర.. అందుకే తిరస్కరించా..

May 24 2026 10:11 AM | Updated on May 24 2026 11:27 AM

Randeep Hooda reveals Reason why he refused Aurangzeb Role in Chhaava

గతేడాది వచ్చిన "ఛావా" సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ విక్కీ కౌశల్‌ ఛత్రపతి శంబాజీ మహారాజ్‌గా, రష్మిక ఏసుబాయిగా ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్‌ ఖన్నా ఔరంగజేబు పాత్రలో మెప్పించాడు. అయితే ఔరంగజేబు రోల్‌కు అక్షయ్‌ మొదటి ఛాయిస్‌ కాదు, అతడి కంటే ముందు నటుడు రణ్‌దీప్‌ హుడాను సంప్రదించారు.

అందుకే నో చెప్పా..
ఈ విషయం గురించి రణ్‌దీప్‌ హుడా మాట్లాడుతూ.. అప్పటికే నేను స్వతంత్ర్య వీర్‌ సావర్కర్‌ సినిమా కోసం చాలా సన్నబడ్డాను. ఆ సమయంలో ఔరంగజేబు పాత్ర కోసం సరిపోతాననిపించలేదు. పైగా వీర్‌ సావర్కర్‌ సినిమాకు సంబంధించి ఓ కోర్టు కేసు కూడా ఎదుర్కొంటున్నాను. ఛావాలో హిందూ-ముస్లింకి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ కథలో ఇరుక్కుని ఇబ్బందులు పడాలనుకోలేదు, ఆ దారిలో అసలు నడవాలనుకోలేదు అని చెప్పాడు. ఇకపోతే లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఛావా చిత్రం రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

చదవండి: క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement