ఛావా డైరెక్టర్‌ మరో సినిమా.. టీజర్ రిలీజ్ | Shraddha Kapoor plays legendary artist Vithabai in Eetha teaser | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: ఛావా డైరెక్టర్‌ మరో సినిమా.. టీజర్ రిలీజ్

Jun 23 2026 3:27 PM | Updated on Jun 23 2026 3:41 PM

Shraddha Kapoor plays legendary artist Vithabai in Eetha teaser

బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ ఈత. స్త్రీ-2 బ్లాక్‌బ‍స్టర్ హిట్ తర్వాత ఆమె పీరియాడికల్ స్టోరీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రణ్‌దీప్ హుడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ మేకర్స్ రిలీజ్ చేశారు.

టీజర్ చూస్తుంటే విఠాబాయి భావు మాంగ్ నారాయణ్‌గావ్‌కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిననట్లు తెలుస్తోంది. బ్రిటీష్ కాలం నుంచే డ్యాన్సర్‌గా ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కొందనే కోణంలో ఈ మూవీ ఉండనుందని అర్థమవుతోంది. ఈ టీజర్‌లో నిండు గర్భిణిగా ఉన్న ఆమె డ్యాన్స్ చేయడం అంచనాలు పెంచుతోంది. ఈ టీజర్‌ చూస్తుంటే ఛావా మూవీలాగే మరో బ్లాక్‌బస్టర్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement