breaking news
Laxman Utekar
-
రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమాతో రికార్డ్
చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) జీవితం నేటి యువతరానికి రోల్ మోడల్ అని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మారుమూల గ్రామమైన సమర్పూర్‌లో జన్మించిన ఆయన సినిమా మీద ఆసక్తితో ముంబై చేరుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఫైనల్‌గా స్టార్ డైరెక్టర్‌గా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది హీరోలు ఆశిస్తున్నారు.'ఛావా'(Chhaava) సినిమాతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ముందు ఆయన కష్టాలు చాలానే ఉన్నాయి. సినిమా మీద ఆసక్తితో తన గ్రామం నుంచి ముంబైకి వచ్చిన లక్ష్మణ్‌కు మొదట ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ఏలాగైనా విజయం సాధించిన తర్వాతే తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన ఖర్చుల కోసం వడాపావ్ అమ్మె షాపులో పనిచేశాడు. ఆపై కొద్దిరోజుల్లోనే ఒక సినిమా స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్ చేసే పనికి కుదిరాడు. అక్కడ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాడు. ఇలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్న ఆయనకు 2007లో ఖన్నా & అయ్యర్ సినిమాతో ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా ఛాన్స్ వచ్చింది. అలా ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పనిచేయడంతో పాటు కొన్ని యాడ్స్ కోసం కూడా వర్క్‌చేశాడు. ఆ తర్వాత మరాఠీ భాషలో కొన్ని సినిమాలు తెరకెక్కించినా ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 2019లో హిందీ సినిమా 'లూకా చుప్పి'తో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మిమి( కృతి సనన్), జరా హట్కే జరా బచ్కే(విక్కీ కౌశల్) చిత్రాలతో దర్శకుడిగా బాలీవుడ్లో మరింత పాపులర్ అయ్యాడు. అయితే, రీసెంట్గా ఛావా సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 805 కోట్లతో రాబట్టి తన సత్తా ఏంటో ఈ ప్రపంచానికి లక్ష్మణ్ ఉటేకర్ చాటాడు. అలా వడాపావ్ బండి నుంచి బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎంతోమంది యువకులకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 50 కోట్లు పైమాటే అని సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'మిమి' చిత్రం రెండు జాతీయ అవార్డులను(National Film Awards) దక్కించుకుంది. ఉత్తమ నటి (కృతి సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి) అవార్డ్స్ అందుకున్నారు. ఆపై ఈ చిత్రం 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది. -
క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?
కొన్ని కథలు వినోదాన్ని పంచితే మరికొన్ని హృదయాలను బరువెక్కిస్తాయి. కొన్ని మాత్రమే మన రక్తం మరిగేలా చేస్తూనే కన్నీళ్ల వరద పారిస్తాయి. అలాంటి సినిమాయే ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీగా నటించాడు. ఆయన భార్య ఏసుబాయిగా హీరోయిన్ రష్మిక మందన్నా యాక్ట్ చేసింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.ద్రోహులుగా చిత్రీకరించారుఇక ఈ సినిమాలో తన పూర్వీకులను తప్పుగా చూపించారంటూ మరాఠా యోధులు గానోజీ, కాన్హోజి షిర్కే వారసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను ఉటంకిస్తూ తమ పూర్వీకులను శంభాజీ మహారాజ్‌కు ద్రోహం చేసినవారిగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఆయా సన్నివేశాల ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకుగానూ చిత్రయూనిట్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)కు నోటీసులు పంపించారు.అసౌకర్యానికి గురైతే క్షమించండిఈ వివాదంపై డైరెక్టర్ లక్ష్మణ్ స్పందిస్తూ ఛావాలో గానోజి, కన్హోజీల పేర్లు మాత్రమే ఉపయోగించామన్నాడు. వారి ఇంటిపేరు, ఏ ప్రాంతానికి చెందినవారు వంటి వివరాలను వెల్లడించలేదన్నాడు. షిర్కే కుటుంబసభ్యుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. ఛావా వల్ల వారు అసౌకర్యానికి గురైతే తనను క్షమించాల్సిందిగా కోరాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు