ఫుట్‌పాత్‌పై నిద్రించిన స్టార్ కమెడియన్.. వీడియో వైరల్ | Bollywood actor Sunil Grover sleeps on Ganga ghat video goes viral | Sakshi
Sakshi News home page

Sunil Grover: సింప్లిసిటీ.. ఫుట్‌పాత్‌పై నిద్రించిన సునీల్ గ్రోవర్

Jun 19 2026 1:50 PM | Updated on Jun 19 2026 1:54 PM

Bollywood actor Sunil Grover sleeps on Ganga ghat video goes viral

సినిమా వాళ్ల లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లగ్జరీ లైఫ్‌తో నచ్చిన ఫుడ్ తింటూ రోజును గడిపేస్తుంటారు. సినీనటుల రోజువారీ జీవన విధానం ఫుల్ లగ్జరీగా ఉంటుంది. సినీరంగంలో తగినంత సంపాదన ఉండడం వల్ల.. అందుకు తగ్గట్టుగానే లైఫ్‌ స్టైల్‌ కూడా ఉంటుంది. అయితే ఇందుకు తాను పూర్తిగా భిన్నం అంటున్నారు బాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ గ్రోవర్. సింప్లీసిటీనే తనకు ఆభరణంగా భావిస్తున్నారు.    

బాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ గ్రోవర్ చాలా సింపుల్‌గా కనిపించారు. తన జీవనశైలి  సాధారణ ప్రజల్లాగే ఉంటుందని మరోసారి నిరూపించారు. గురువారం రాత్రి గంగా ఘాట్‌లో తాను నిద్రిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు తారే జమీన్ పర్ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఇందులో ఆయన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తూ కనిపించారు. సాధారణ భక్తుల్లాగే సునీల్ పుట్‌పాత్‌పై నిద్రించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో 'జై కాల్ మహాకాల్' అనే భక్తి గీతం వినిపించింది. ఇది చూసిన అభిమానులు మీరు అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తారని కొందరు రాసుకొచ్చారు.

సునీల్ గతంలో కూడా తన రోజువారీ దినచర్యకు సంబంధించిన ఇలాంటి దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొన్ని నెలల క్రితమే రోడ్డు పక్కన ఉన్న చేతి పంపు వద్ద బట్టలు ఉతుకుతున్న వీడియోను పోస్ట్ చేశాడు.  ఇక సినిమాల విషయానికొస్తే సునీల్ చివరిసారిగా 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో కనిపించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement