సినిమాల్లోకి కత్రినా కైఫ్ రీఎంట్రీ..? | Katrina Kaif re-entry into films | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి కత్రినా కైఫ్ రీఎంట్రీ..?

Jun 11 2026 11:21 PM | Updated on Jun 12 2026 5:39 AM

Katrina Kaif re-entry into films

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె టీమ్ పూర్తిగా ఖండించింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది.

కొడుకు విహాన్ కౌశల్ జననం తర్వాత కత్రినా పూర్తిగా తన కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. గత రెండేళ్లుగా కత్రినా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన భర్త విక్కీ కౌశల్, కొడుకు విహాన్‌తో విహార యాత్రలు చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఆనందిస్తోంది.

తాజాగా 2027 ద్వితీయార్థంలో వెండితెరపైకి తిరిగి వస్తారనే ఊహాగానాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్రాజెక్ట్‌తో అడుగుపెడతారనే వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని ఆమె టీమ్ స్పష్టం చేసింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది. దాంతో రీఎంట్రీ లేదని తేలిపోయింది. ఇక తన నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా కత్రినా విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె సొంత కాస్మోటిక్స్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ భారతీయ మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, వ్యాపార రంగంతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా కత్రినా బిజీగా ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement