
సాక్షి, తిరుమల : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. స్వామివారి ప్రసాదం ధరలను టీటీడీ భారీగా పెంచేసింది. 25 రూపాయలున్న సాధారణ లడ్డు ధర ... రూ.50 లకు, వంద వున్న కళ్యాణం లడ్డు ధర, రెండు వందల రూపాయలకు, అదనంగా కేటాయించే లడ్డులపై వంద శాతం ధరను టీటీడీ పెంచేసింది. అదే విధంగా 25 రూపాయలున్న వడ ధరను వందకు పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు సమాచారం లేకుండా.... పెంచిన ధరలను అధికారులు నేటి నుంచి అమలు చేసేశారు.