శ్రీవారి సేవలో నటుడు
తిరుమల: శ్రీవారిని గురువారం సినీ నటులు బ్రహ్మానందం, శ్రీరామ్, సినీ గాయని మంగ్లీ దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాఅఉ అందజేశారు.
రూ.4 కోట్ల విలువైన భూమిని లాక్కున్న వ్యక్తి అరెస్టు
అన్నానగర్: వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారికి చెందిన రూ.4 కోట్ల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వ్యక్తిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సమీపంలోని మైలాపూర్‌లోని రామకృష్ణ మఠం విభాగానికి చెందిన పద్మనాభన్ (50). ఇతను చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో ‘‘నా తండ్రి రామచంద్రన్ పదవీ విరమణ చేసిన వ్యవసాయ కార్మికుడు. తన సర్వీసు కాలంలో, 1976లో పలవంతంగల్ ప్రాంతంలో 2,992 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేశారు.అతను కొండాలో ఖాళీగా ఉన్న భూమిని కొని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆలందూర్‌లోని కన్నన్ కాలనీకి చెందిన హరికృష్ణన్ (46) అనే వ్యక్తి ఆ భూమిని అలెగ్జాండర్ కి విక్రయం చేసినట్లు తేలింది.
ఈనేపథ్యంలో అతని నుంచి భూమిని తిరిగి ఇప్పివ్వాలి’’ అని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అరుణ్ ఆదేశించారు. దీని ప్రకారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో రామచంద్రన్‌కు చెందిన రూ.4 కోట్ల విలువైన భూమిని హరికృష్ణన్ అలెగ్జాండర్ కు రూ.18 లక్షలకు విక్రయించి, డబ్బును విభజించినట్లు వెల్లడైంది. ఆ తర్వాత, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మోసంలో పాల్గొన్న హరికృష్ణన్ ను అరెస్టు చేశారు. అతను నంగనల్లూర్‌లోని డాక్యుమెంట్ రైటింగ్ కార్యాలయంలో మధ్యవర్తిగా పనిచేస్తున్నారు. నకిలీ డీడ్‌తో విక్రయించిన భూమిని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.
శ్రీవారి సేవలో నటుడు శ్రీరామ్


