బౌల‌ర్ల‌ను ఉతికారేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. వీడియో వైరల్‌ | Vaibhav Sooryavanshi Takes India Stars To Cleaners Ahead Of England Series Opener | Sakshi
Sakshi News home page

IND vs ENG: బౌల‌ర్ల‌ను ఉతికారేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. వీడియో వైరల్‌

Jul 1 2026 3:36 PM | Updated on Jul 1 2026 3:51 PM

Vaibhav Sooryavanshi Takes India Stars To Cleaners Ahead Of England Series Opener

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు స‌మ‌యం అస‌న్న‌మైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 బుధ‌వారం డ‌ర్హ‌మ్ వేదిక‌గా జ‌ర‌నగ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు మ‌రోసారి యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ గురుంచి క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌న‌డుస్తోంది. 

ఈ 15 ఏళ్ల చిచ్చ‌ర‌పిడుగు సీనియర్ జట్టు త‌ర‌పున అరంగేట్రం చేస్తాడా లేదా అన్న‌దే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన‌ప్ప‌టికి వైభ‌వ్‌కు మాత్రం డెబ్యూ చేసే అవ‌కాశం ల‌భించ‌లేదు. సంజూ శాంస‌న్‌, అభిషేక్ వంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఉండ‌డంతో వైభ‌వ్‌ను మేనెజ్‌మెంట్ బెంచ్‌కే ప‌రిమితం చేసింది.

ఈ క్ర‌మంలో హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్‌, కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌పై చాలా మంది మాజీ క్రికెట‌ర్లు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐపీఎల్‌లో దుమ్ములేపిన వైభ‌వ్‌కు ఓ అవ‌కాశం ఇవ్వాల‌ని మేనెజ్‌మెంట్‌ను సూచించారు. కానీ ఇంగ్లండ్ టూర్‌లో కూడా వైభ‌వ్ అరంగేట్రం చేసే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.


సీనియ‌ర్ల‌కు త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని కెప్టెన్ అయ్య‌ర్ మరోసారి స్ప‌ష్టం చేశాడు. ఏదేమైన‌ప్ప‌టికి వైభ‌వ్ మాత్రం త‌న ప్రాక్టీస్‌ను ఆప‌డం లేదు. తొలి టీ20కు ముందు జ‌రిగిన నెట్ ప్రాక్టీస్ సెష‌న్‌లో భార‌త బౌల‌ర్ల‌పై వైభ‌వ్ విరుచుకుప‌డ్డాడు. ప్ర‌సిద్ద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ వంటి సీనియర్ పేసర్లను సూర్యవంశీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

తుది జ‌ట్లు
భార‌త్‌(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయ‌స్ అయ్యర్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

ఇంగ్లండ్‌: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్
చదవండి: మ్యాచ్ రద్దయినా రూ.8 లక్షలు ఫిక్స్! అంపైర్ల సంపాదన ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement