టాస్‌ గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌ లక్ష్యం ఎంతంటే? | IND vs ENG 1st T20: Playing 11 And Toss Update | Sakshi
Sakshi News home page

IND vs ENG 1st T20: టాస్‌ గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌ లక్ష్యం ఎంతంటే?

Jul 1 2026 9:35 PM | Updated on Jul 2 2026 4:37 AM

IND vs ENG 1st T20: Playing 11 And Toss Update

👉ఇంగ్లండ్‌, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌, అభిషేక్‌ ఫిఫ్టీలతో రాణించగా.. ఆఖర్లో దూబే సిక్సర్ల వర్షం కురిపించాడు.

👉ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 38 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.

👉12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసిందిశ్రేయస్‌ అయ్యర్‌ (39), తిలక్‌ వర్మ (11) క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్‌ శర్మ (59) ఎల్బీగా వెనుదిరిగాడు.

20 బంతుల్లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఫిఫ్టీ సాధించాడు. 8 ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. 

దంచుతున్న అభిషేక్‌ శర్మ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి  52 పరుగులు చేసింది. అభిషేక్‌ 16 బంతుల్లో 44 పరుగులతో ఆడుతుండగా, కెప్టెన్‌ అయ్యర్‌ ఆరు పరుగులతో సహకరిస్తున్నాడు. 

చెస్టర్-లె-స్ట్రీట్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా తొలి టీ20లో ఇంగ్లండ్‌-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.

తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వరుణ్‌ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. రవి బిష్ణోయ్‌కు కూడా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కింది.

తుది జట్లు
ఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్

భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement