వైభ‌వ్ సూర్యవంశీ ఎంట్రీ.. గంభీర్‌కు కొత్త త‌ల‌నొప్పి! | Drop Samson or Abhishek? Vaibhav Sooryavanshi reported to make India debut in 1st T20I vs Ireland | Sakshi
Sakshi News home page

IND vs IRE: వైభ‌వ్ సూర్యవంశీ ఎంట్రీ.. గంభీర్‌కు కొత్త త‌ల‌నొప్పి!

Jun 22 2026 9:01 PM | Updated on Jun 22 2026 9:29 PM

Drop Samson or Abhishek? Vaibhav Sooryavanshi reported to make India debut in 1st T20I vs Ireland

అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భార‌త జ‌ట్టు మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు భార‌త సీనియ‌ర్ జ‌ట్టు ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలో మెన్ ఇన్ బ్లూ బ‌రిలోకి దిగనుంది. 

అదేవిధంగా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ కూడా ఐర్లాండ్ టూర్‌కు వెళ్లే భార‌త జ‌ట్టులో ఉండ‌డంతో అంద‌రి దృష్టి ఈ సిరీస్‌పైనే ఉంది. జూన్ 26న బెల్‌ఫెస్ట్ వేదిక‌గా ఐరీష్ జ‌ట్టుతో జ‌ర‌గ‌నున్న తొలి టీ20లో వైభ‌వ్ భార‌త త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేయనున్న‌ట్లు తెలుస్తోంది.

గంభీర్‌కు కొత్త తలనొప్పి
అయితే వైభ‌వ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకువాలంటే భార‌త రెగ్యుల‌ర్  ఓపెనర్లైన సంజూ శాంస‌న్ లేదా అభిషేక్ శ‌ర్మ‌ల‌లో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఎందుంక‌టే వీరిద్ద‌రూ ఇప్ప‌టికే ఓపెన‌ర్ల‌గా త‌మ‌ను తాము నిరూపించుకున్నారు. టీ20ల్లో నంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్‌ అభిషేక్ శ‌ర్మ ప‌వ‌ర్‌ప్లేలో బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించ‌గ‌లే విధ్వంస‌క‌ర వీరుడు. అలాంటి ప్లేయ‌ర్‌ను డ్రాప్ చేయడం అంత సులువు కాదు.

మ‌రోవైపు ఇటు ఓపెనర్‌గా, అటు వికెట్ కీపర్‌గా జట్టుకు వెన్న‌ముక‌గా ఉన్న సంజూను త‌ప్పించ‌డం కూడా అసాధ్యం. అయితే గంభ‌ర్ ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయి.  ఐర్లాండ్ సిరీస్ చిన్నది  సంజూ శాంసన్‌కు మొదటి మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చి వైభవ్‌ను ఆడించడం. 

లేదా లేదా సంజూను మూడో  స్థానానికి పంపి, అభిషేక్ - వైభవ్ లతో లెఫ్ట్-లెఫ్ట్ కాంబినేషన్ ఓపెనింగ్ చేయించడం. సంజూ ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపితే ఇన్‌ఫామ్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌ను ప‌క్క‌న పెట్టాల్సిందే. మ‌రి గంభీర్ అండ్ కో ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి. ఒక‌వేళ 15 ఏళ్ల వైభ‌వ్‌ అరంగేట్రం చేస్తే మాత్రం భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడిన అతి పిన్న‌వ‌య‌ష్కుడిగా స‌చిన్‌(16)ను అధిగ‌మిస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement