ఇంగ్లండ్‌తో మూడో టీ20కి ముందు భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే ఈ విషయమై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేనేజ్‌మెంట్ వర్గాలు వివరణ ఇచ్చాయి. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో వైభవ్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, త్రో-డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి అతడి ఛాతిపై బలంగా తాకింది.
దీంతో అతడు వెంటనే నెట్స్ నుంచి బయటకు వచ్చాడు. జట్టు వైద్యుడు పరీక్షించిన అనంతరం కొద్దిసేపటికే మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. దీంతో అతడికి ఎలాంటి తీవ్రమైన గాయం లేదని స్పష్టమైంది. ఈ ఘటన తర్వాత భారత శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ, వైభవ్ మళ్లీ నెట్స్‌లోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, నాటింగ్హమ్ వేదికగా ఇవాళ రాత్రి 10 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభమయ్యే మూడో టీ20లో వైభవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయమే. జులై 4న జరిగిన రెండో టీ20తో టీమిండియా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు, ఆ మ్యాచ్‌లో మంచి షాట్లు (10 బంతుల్లో 14; 2 సిక్సర్లు) ఆడినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు.
దీంతో నేటి మ్యాచ్‌లో వైభవ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పై ఈ సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకపడి ఉంది. ఈ పరిస్థితుల్లో వైభవ్ ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే టీమిండియా సిరీస్‌లో కుదురుకోవచ్చు.
ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వాస్తవానికి రెండో టీ20లో టీమిండియానే గెలవాల్సి ఉండింది.
అయితే కీలక దశలో రవి భిష్ణోయ్ ఓ ఖరీదైన ఓవర్ వేసి టీమిండియా కొంపముంచాడు. ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత అభిమానులు భిష్ణోయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చెత్త ప్రదర్శన తర్వాత భిష్ణోయ్ నేటి మ్యాచ్‌లో ఆడటం దాదాపుగా అసాధ్యమే.


