టాస్‌ గెలిచిన టీమిండియా: అతడిపై వేటు.. వైభవ్‌ అరంగేట్రం | IND vs ENG 2nd T20I Toss Playing XIs Updates Highlights | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచిన టీమిండియా: అతడిపై వేటు.. వైభవ్‌ అరంగేట్రం

Jul 4 2026 6:33 PM | Updated on Jul 4 2026 9:06 PM

IND vs ENG 2nd T20I Toss Playing XIs Updates Highlights

ఇంగ్లండ్‌తో రెండో టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ స్థానాన్ని పదిహేనేళ్ల వైభవ్‌ భర్తీ చేశాడు.

టాస్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘‘మేము ఈసారి కూడా తొలుత బ్యాటింగ్‌ చేస్తాం. మా తుదిజట్టులో ఒక మార్పు. సంజూ స్థానంలో వైభవ్‌ ఆడతాడు. గత రెండు నెలలుగా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.

అత్యుత్తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతడు ఒత్తిడికి లోనుకాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలకడగా ఆడగలడు’’ అని వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 

కాగా 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన వైభవ్‌.. అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మరోవైపు.. గత మూడు మ్యాచ్‌లలో విఫలమైన సంజూ (5, 0, 1)పై యాజమాన్యం వేటు వేసింది.

తుదిజట్లు
టీమిండియా
వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివం దూబే, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి.

ఇంగ్లండ్‌
ఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), జేకబ్‌ బెతెల్‌, టామ్‌ బాంటన్‌, సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, లియామ్‌ డాసన్‌, ఆదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, జోష్‌ టంగ్‌.

చదవండి: శ్రీలంకతో వన్డే.. భారత్‌ ఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement