తప్పు చేశారు.. వైభవ్‌కు అవకాశమివ్వాల్సింది! | Big-Mistake Might-Vaibhav Sooryavanshi Should Play Vs Ireland T20I | Sakshi
Sakshi News home page

తప్పు చేశారు.. వైభవ్‌కు అవకాశమివ్వాల్సింది!

Jun 26 2026 10:28 PM | Updated on Jun 26 2026 11:21 PM

Big-Mistake Might-Vaibhav Sooryavanshi Should Play Vs Ireland T20I

ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీమిండియా దారుణ పరాజయం చవిచూసింది. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 148 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే పసికూన చేతిలో ప్రపంచ నంబర్‌వన్‌, చాంపియన్ అయిన భారత్ ఓటమిని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 

టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసి చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్‌తో తొలి టీ20లో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటమి సంగతి పక్కనబెడితే.. ఇవాళ వైభవ్ జట్టులో ఉండుంటే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ వచ్చేవాడు. 

ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ విధ్వంసంర చూశాకా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయకపోయినా వేగంగా పరుగులు చేసేవాడు. ఆరంభంలోనే ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించేవాడేమో. అవసరమయితే 12 లేదా 13 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసేవాడేమో. అతడి విధ్వంసంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుండేదేమో. అభిషేక్ శర్మ తన స్టైల్ ఆటను ఆడినప్పటికీ, ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్‌తో పాటు ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడం టీమిండియా కొంపముంచింది. 

ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడం టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆదుకుంటాడునుకున్న తిలక్ వర్మ చేతులెత్తేయడం, ఆల్‌రౌండర్ ట్యాగ్‌లు తగిలించుకొని బరిలోకి దిగిన శివమ్ దూబే, అక్షర్‌పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు బాధ్యతగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకోవడం కనిపించింది. 

ఇదంతా జరగకుండా ఉండాలని అనుకొని ఉంటే వైభవ్‌కు ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది అన్నట్లుగా.. వైభవ్‌ను ఆడించకుండా తప్పు చేశారు అని చాలా మంది అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement