టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్ర సిరీస్‌లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వైభవ్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 15 ఏళ్ల వైభవ్‌కు అంతర్జాతీయ వేదికపై తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి మరో అవకాశం ఇప్పుడు లభించింది.
జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత ఇన్నింగ్స్‌ను వైభవ్ ప్రారంభించనున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ప్రపంచ క్రికెట్‌లో గొప్ప స్టార్‌గా ఎదుగుతాడని రజా కొనియాడాడు.
"వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన క్రికెటర్. కేవలం 15 ఏళ్ల వయస్సులో ప్రపంచస్థాయి బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అమోఘం. అయితే అంతర్జాతీయ స్ధాయిలో ఆడేటప్పుడు సహజంగా ఆటగాళ్లపై ఒత్తడి ఉంటుంది. కాబట్టి కేవలం రెండు లేదా మూడు మ్యాచ్‌లలో విఫలమైనంత మాత్రాన వైభవ్‌ను విమర్శించడం సరికాదు.
ఎంతో మంది గొప్ప క్రికెటర్లతో వైభవ్ డ్రెసింగ్ రూమ్‌ను షేర్ చేసుకుంటున్నాడు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. బీసీసీఐ వైభవ్‌ను సరైన దిశలో నడిపిస్తే, అతడు ఖచ్చితంగా ఈ తరంలో గొప్ప క్రికెటర్ అవుతాడని" రజా హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా జూలై 23న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే-భారత్ మధ్య తొలి టీ20 జరగనుంది. వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోయిన టీమిండియా.. తిరిగి జింబాబ్వే పర్యటనలో పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.
చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్


