వైభవ్‌ సూర్యవంశీకి భారీ షాక్‌..! | Focus On Vaibhav Sooryavanshi As India Likely To Make Big Change For 3rd T20I | Sakshi
Sakshi News home page

IND vs ENG: వైభవ్‌ సూర్యవంశీకి భారీ షాక్‌..!

Jul 6 2026 5:30 PM | Updated on Jul 6 2026 5:57 PM

Focus On Vaibhav Sooryavanshi As India Likely To Make Big Change For 3rd T20I

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఒక్క మ్యాచ్‌కే పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే క్రికెట్ వ‌ర్గాలు. మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో వైభ‌వ్ అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన  సంగ‌తి తెలిసిందే. భార‌త్ త‌ర‌పున డెబ్యూ చేసిన అతి పిన్న‌వ‌య‌ష్కుడిగా చ‌రిత్ర‌ను తిర‌గరాసిన సూర్య‌వంశీ.. త‌న మొదటి మ్యాచ్‌లో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. 

సీనియ‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ స్ధానంలో తుది జ‌ట్టులోకి వ‌చ్చిన వైభ‌వ్‌, త‌న మార్క్‌ను చూపించలేక‌పోయాడు. 10 బంతులు ఎదుర్కొని కేవ‌లం 14 ప‌రుగులు చేసి నిరాశ‌ప‌రిచాడు. దీంతో శాంస‌న్‌ను తిరిగి ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి తీసుకు రావాల‌ని హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ అండ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

సిరీస్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకోవాలంటే మూడో టీ20లో  భార‌త్  క‌చ్చితంగా గెల‌వాల్సిందే. ప్ర‌స్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.  దీంతో కీల‌కమైన మూడో టీ20లో శాంస‌న్ తిరిగి ఆడ‌నున్న‌ట్లు స‌మాచారం.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన శాంస‌న్‌.. యూకే ప‌ర్య‌ట‌న‌లో మాత్రం తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే పరిమిత‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని ప‌క్క‌న పెట్టి వైభ‌వ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకున్నారు. కానీ అత‌డు కూడా విఫ‌లం కావ‌డంతో సీనియ‌ర్ అయిన సంజూకే మ‌ళ్లీ అవ‌కాశ‌మివ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

ఈ నెల‌ఖారులో జింబాబ్వేతో జ‌రిగే టీ20 సిరీస్‌లో వైభ‌వ్‌ను పూర్తి స్ధాయిలో ఆడించే యోచ‌నలో మేనెజ్‌మెంట్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా మూడు టీ20ల సిరీస్ కోసం భార‌త క్రికెట్ జూలై ఆఖ‌రిలో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్ సీనియ‌ర్ ప్లేయ‌ర్ అభిషేక్ శ‌ర్మ‌కు విశ్రాంతి ఇచ్చే అవ‌కాశ‌ముంది. ఈ క్ర‌మంలో వైభ‌వ్‌ భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు అస్కారం ఉంది.
చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్‌ కుమారుడి విశ్వరూపం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement