శ్రీలంక-ఏతో మ్యాచ్‌.. వైభ‌వ్‌ సూర్యవంశీ ప్లాఫ్‌ షో | Vaibhav Sooryavanshi Out For 21 Runs, Failure Continues Vs Sri Lanka-A-Match, Fans Troll Youngster Over Poor ODI Form | Sakshi
Sakshi News home page

శ్రీలంక-ఏతో మ్యాచ్‌.. వైభ‌వ్‌ సూర్యవంశీ ప్లాఫ్‌ షో

Jun 15 2026 10:40 AM | Updated on Jun 15 2026 11:33 AM

Vaibhav Sooryavanshi Out 21 Runs-Failure Continues Vs Sri Lanka-A-Match

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ప్లాఫ్‌ షో విజయవంతంగా కొన‌సాగుతుంది. ట్రై సిరీస్‌లో భాగంగా సోమ‌వారం దంబుల్లా వేదిక‌గా శ్రీలంక‌-ఏతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో వైభ‌వ్ మరోసారి నిరాశ‌ప‌రిచాడు. మంచి ఈజ్‌తోనే బ్యాటింగ్ ప్రారంభించిన‌ప్ప‌టికీ వైభవ్‌ ఎక్కువ‌సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయాడు. 

14 బంతుల్లో 21 ప‌రుగులు చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ సాహ‌న్ అరాచిగే బౌలింగ్‌లో వ‌నుజా సాహ‌న్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంక‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 14 ప‌రుగులు చేసిన వైభ‌వ్ ఆఫ్గ‌న్‌తో మ్యాచ్‌లో 22 బంతుల్లో 44 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. తాజాగా లంక‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో క్రీజులో ఎక్కువ‌సేపు నిలుస్తాడ‌నుకున్న‌ప్ప‌టికీ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో వైభవ్‌ సూర్యవంశీపై సోషల్‌ మీడియాలో అభిమానులు ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. ‘వన్డే క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవం ప్లాఫ్‌ షో కొనసాగుతోంది’.. ‘టీ20 ఆట వన్డేల్లో పనికిరాదు’.. ‘ఓవర్‌ హైప్‌ వల్ల ఆడలేకపోతున్నాడు’ అంటూ కామెంట్లు చేశారు.

ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్ర‌స్తుతం భార‌త‌-ఏ జ‌ట్టు 6 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 39 ప‌రుగులు చేసింది.మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తిలక్ వర్మ తెలిపాడు. యశ్ ఠాకూర్‌, అనుకుల్ రాయ్ తుదిజట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రీలంక జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

తుది జ‌ట్లు:
ఇండియా-ఏ: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీప‌ర్‌), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్‌), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకూల్ రాయ్, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్

శ్రీలంక‌-ఏ: నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీప‌ర్‌), అవిష్క ఫెర్నాండో, విషెన్ హలంబాగే, సదీర సమరవిక్రమ, అహన్ విక్రమసింఘే, సహన్ అరాచ్చిగే(కెప్టెన్‌), వనుజా సహన్, విజయకాంత్ వియస్కాంత్, కుగతస్ మతులన్, చమిక కరుణరత్నే, మహ్మద్ షిరాజ్.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement