వైభవ్‌ ఫెయిల్‌.. అయినా భారత్‌ భారీ స్కోర్‌ | Vaibhav Sooryavanshi Fails On Debut But Ishan Kishan, Abhishek Sharma Propel India To 190-7 | Sakshi
Sakshi News home page

IND vs ENG: వైభవ్‌ ఫెయిల్‌.. అయినా భారత్‌ భారీ స్కోర్‌

Jul 4 2026 8:53 PM | Updated on Jul 4 2026 8:55 PM

 Vaibhav Sooryavanshi Fails On Debut But Ishan Kishan, Abhishek Sharma Propel India To 190-7

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టీ20లో భారత బ్యాట‌ర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 ప‌రుగులు స్కోర్ సాధించింది.

భార‌త ఇన్నింగ్స్‌లో అరంగేట్ర ఆట‌గాడు వైభ‌వ్ సూర్యవంశీ(14) విఫ‌ల‌మైన‌ప్ప‌టికి.. ఇషాన్‌ కిషన్‌(40 బంతుల్లో 49), అభిషేక్‌ శర్మ(43), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(37), తిలక్‌ వర్మ(24) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కుర్రాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌, విల్‌ జాక్స్‌, డాసన్‌ తలా వికెట్‌ సాధించారు. 

వైభవ్‌ రెండు భారీ సిక్స్‌లు కొట్టి మంచి టచ్‌లో కనిపించినప్పటికి.. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో కేవలం 14 పరుగులు చేసి సూర్యవంశీ స్టంపౌటయ్యాడు.

తుదిజట్లు
టీమిండియా
వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివం దూబే, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి.

ఇంగ్లండ్‌
ఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), జేకబ్‌ బెతెల్‌, టామ్‌ బాంటన్‌, సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, లియామ్‌ డాసన్‌, ఆదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, జోష్‌ టంగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement