ఇదంతా ఓ కలలా ఉంది.. మాటలు కూడా రావడం లేదు: వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Sooryavanshi's India Jersey Number Revealed | Sakshi
Sakshi News home page

ఇదంతా ఓ కలలా ఉంది.. మాటలు కూడా రావడం లేదు: వైభవ్‌ సూర్యవంశీ

Jun 23 2026 10:52 AM | Updated on Jun 23 2026 11:28 AM

Vaibhav Sooryavanshi's India Jersey Number Revealed

రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవం‍శీ భారత సీనియర్ క్రికెట్ జట్టు తరపున అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. జూన్ 26న బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్న తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో వైభవ్‌కు భారత జెర్సీని అందజేశారు. హోటల్ గదిలో జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదగా తొలి భారత జెర్సీని వైభవ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీ ఎక్స్‌లో షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ చిచ్చర పిడుగుకు '03' నంబర్ గల జెర్సీని కేటాయించారు. గతంలో టీమిండియా దిగ్గజాలు హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు ఈ నంబర్ జెర్సీని ధరించి ఆడిన సంగతి తెలిసిందే.

"బ్యాట్ పట్టుకున్న మొదటి రోజు నుంచి కన్న కల ఇది. ఈ రోజు ఆ కల సాకారమైంది. ఈ అపూరూప క్షణంలో నాకు మాటలు కూడా రావడం లేదు. అదంతా ఒక కలలా అనిపించింది. 

ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. నా క్రికెట్‌ ప్రయాణంలో అత్యంత కీలకమైన అడుగు పడినందుకు సంతోషంగా ఉంది. భారత జెర్సీని ధరించడం నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నాను" అని బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో వైభవ్ పేర్కొన్నాడు. 

అయితే వైభ‌వ్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ఇవ్వ‌డం కోసం రెగ్యూల‌ర్ ఓపెన‌ర్లైన సంజూ శాంస‌న్ లేదా అభిషేక్ శ‌ర్మ‌ల‌లో ఎవ‌రో ఒక‌రిని ప‌క్క‌న పెట్టాలి. లేదంటే సంజూను ఫ‌స్ట్ డౌన్‌లో ఆడించి వైభ‌వ్‌కు ఓపెన‌ర్‌గా పంపాలి. ఇదే జ‌రిగితే కిషాన్‌ను తుది జ‌ట్టు నుంచి త‌ప్పించాల్సి ఉంటుంది. మ‌రి టీమ్ మేనెజ్‌మెంట్ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి.
 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement