శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ హైలైట్‌గా నిలిచింది.
లంక ఆటగాళ్ల తప్పు అటుంచితే, వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. మరి ఈ గొడవతో వైభవ్ సూర్యవంశీపై నిషేధం పడనుందా అనేది ఒకసారి తెలుసుకుందాం. నిజానికి ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది.
అయితే వైభవ్, లంక ఆటగాదళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. కేవలం మ్యాచ్ రిఫరీ నుంచి జరిమానా ఎదుర్కొనేందుకు ఆస్కారముంది. అంతేకాదు బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.
అసలేం జరిగింది?
మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వల్ప గొడవ జరిగింది. వైభవ్, సూర్యాంశ్‌లను ఉద్దేశించి లంక ఆటగాళ్లు ఏదో అనడంతో క్రికెటర్లు ఒకరిపై మరొకరు దూసుకొచ్చారు. సూర్యాంశ్ వైపు వెళుతున్న విశేన్ హలంబాగేను వైభవ్ అడ్డుకోగా... అతడిని కూడా లంక ఆటగాడు తోసేశాడు. సీనియర్ ఆటగాడు డిక్‌వెలా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడిపించాల్సి వచ్చింది. తిరిగి వెళుతూ కూడా 15 ఏళ్ల వైభవ్ మీ సంగతి చూస్తా అన్నట్లుగా హెచ్చరిస్తూ సైగలు చేయడం కనిపించింది.
జాతీయ జట్టులో చోటు
ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్‌ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసింది. తాజా ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రంకు ముందే వైభవ్ సూర్యవంశీ నిషేధం ఎదుర్కోనున్నాడా అనేది చూడాలి. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లోనూ వైభవ్ సూర్యవంశీ రాణించడంలో విఫలమవుతున్నాడు.
మూడు మ్యాచ్‌లు కలిపి 69 పరుగులు మాత్రమే చేసిన వైభవ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టీ20, వన్డే ఫార్మాట్లలో ఒకేలా ఆడుతానంటే కుదరదు.. కొంచెం ఓపిక వహించాల్సిన అవసరముందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.
Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5
— Qamar. (@Qamar5618) June 15, 2026
A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK
— Qamar. (@Qamar5618) June 15, 2026


