ENG vs IND: భారత్‌ తుది జట్టు ఇదే! వైభవ్‌కు నో ఛాన్స్‌ | England vs India 1st T20I Playing 11: Check probable XIs | Sakshi
Sakshi News home page

ENG vs IND: భారత్‌ తుది జట్టు ఇదే! వైభవ్‌కు నో ఛాన్స్‌

Jul 1 2026 5:59 PM | Updated on Jul 1 2026 6:14 PM

England vs India 1st T20I Playing 11: Check probable XIs

ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఘోర ప‌రాభావం త‌ర్వాత తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ద‌మైంది. బుధ‌వారం డుర్హ‌మ్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో మొద‌టి టీ20లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని మెన్ ఇన్ బ్లూ ప‌ట్టుద‌లతో ఉంది.

బౌన్సీ పిచ్‌ల‌పై రాణించేందుకు భార‌త బ్యాట‌ర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు శ్రేయ‌స్ సేన‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. గాయం కార‌ణంగా ఐర్లాండ్ టూర్‌కు దూర‌మైన స్టార్ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి తిరిగి క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో చ‌క్ర‌వ‌ర్తి బ‌రిలోకి దిగడం దాదాపు ఖాయ‌మైంది. అతడు పున‌రాగ‌మ‌నం చేస్తే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ సూర్యన్ష్ షెడ్గేను ప‌క్క‌న పెట్టే అవ‌కాశ‌ముంది.

మ‌రోవైపు యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ మ్యాచ్‌కు కూడా బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఓపెనింగ్ జోడీ అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్‌ల‌ను కొన‌సాగించాల‌ని టీమ్ మేనెజ్‌మెంట్ నిర్ణ‌యించే అవ‌కాశ‌ముంది.

ఐర్లాండ్ సిరీస్‌లో సంజూ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి.. ఇంగ్లండ్ సిరీస్‌లో తిరిగి పుంజుకుంటాడ‌ని కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ బ‌లంగా న‌మ్ముతున్నారు. ఒక‌వేళ తొలి మూడు టీ20ల‌లో శాంస‌న్ విఫ‌ల‌మైతే వైభ‌వ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంది.

అదేవిధంగా యువ పేస‌ర్ ప్రిన్స్ యాద‌వ్‌కు మ‌రో అవ‌కాశ‌మిచ్చేందుకు మేనెజ్‌మెంట్ సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోపోవ‌చ్చు. ఇంగ్లండ్ ఇప్ప‌టికే తమ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది. స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్‌కు ఇంగ్లండ్ క్రికెట్ విశ్రాంతి ఇచ్చింది.

తుది జ‌ట్లు
భార‌త్‌(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయ‌స్ అయ్యర్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

ఇంగ్లండ్‌: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement