పోలీసుల కాల్పుల్లో నలుగురు తీవ్రవాదుల హతం | Sakshi
Sakshi News home page

పోలీసుల కాల్పుల్లో నలుగురు తీవ్రవాదుల హతం

Published Wed, Oct 2 2013 8:42 AM

Four militants killed in encounter at pakistan

పోలీసు సిబ్బంది జరిపిన కాల్పుల్లో నిషేధిత తీవ్రవాద సంస్థ తెహ్రిక్-ఈ-తాలిబాన్కు చెందిన నలుగురు తీవ్రవాదులు మృతి చెందారని సీఐడీ ఎస్పీ చౌదరి అస్లామ్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. మృతుల వద్ద నుంచి  దాదాపు 200 కేజీల పేలుడు పదార్థంతోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించినట్లు తెలిపారు. బాంబుల తయారీలో వారిద్దరు నిపుణులని పేర్కొన్నారు. గత అర్థరాత్రి బలూచిస్థాన్ నుంచి కరాచీ వైపు వస్తున్న ఓ ట్రక్ను పోలీసులు తనిఖీలలో భాగంగా అపారు.

 

అయితే ఆ ట్రక్లో ఉన్న తీవ్రవాదులు ఒక్కసారిగా  కాల్పులు ప్రారంభించారు. దాంతో పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఆ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలపాయ్యారు. అయితే వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చౌదరి అస్లామ్ వివరించారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల అనంతరం పాకిస్థాన్లో కరాచీలో జరిగిన పలు బాంబు దాడులతో ఈ తీవ్రవాదుల ప్రమేయం ఉందని చౌదరి అస్లామ్ చెప్పారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement