భారత్‌లో చొరబడేందుకు పాకిస్తానీయులు యత్నించారు. అరేబియా సముద్ర మార్గం ద్వారా తొమ్మిదిమంది పాకిస్తానీయులు.. భారత్‌లో చొరబాటుకు యత్నించారు. కానీ వారిని భారత సైనికులు పట్టుకున్నారు. భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని బంధించి గుజరాత్‌కు తీసుకువస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పినా వారి కార్యకలాపాల్లో మార్పు రావడం లేదు. మత్స్యకారుల వేషంలో ఓ పడవలొ పయనిస్తూ తొమ్మిదిమంది పాక్ దేశీయలు భారత్‌లో చొరబడేందుకు పన్నాగం వేశార.
నిన్న(బుధవారం, జనవరి 14వ తేదీ) రాత్రి, భారత కోస్ట్ గార్డ్ గస్తీ నౌక అరేబియా సముద్రంలో సాధారణ నిఘాలో ఉంది. అయితే . అకస్మాత్తుగా, రాడార్ అనుమానాస్పద కదలికను గుర్తించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో భారత జలాల్లో ఒక పడవ నిశ్శబ్దంగా కదులుతోంది. ఇది సాధారణ ఫిషింగ్ నౌకలా కనిపించలేదు, ఎందుకంటే దాని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇదే సైనికుల అనుమానాలను రేకెత్తించింది. దాంతో కోస్ట్‌గార్డ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సంకెళ్లతో బంధించి గుజరాత్‌లోని పోర్ట్‌కు తీసుకువస్తున్నారు.
इंडियन कोस्ट गार्ड ने 9 पाकिस्तानी नागरिक को अवैध घुसपैठ की कोशिश में पकड़ा है. अरब सागर में 14 जनवरी की रात इंडियन कोस्ट गार्ड पेट्रोलिंग कर रही थी तभी उन्हें मछुवारों के भेस में भारत की सीमा में प्रवेश करते हुए पकितानियों को पकड़ा है. फिलहाल मामले की जांच जारी है. pic.twitter.com/A1lQfhHCBR
— Versha Singh (@Vershasingh26) January 15, 2026


