టి20 ప్రపంచకప్ టోర్నీకి పాకిస్తాన్ జట్టు ప్రకటన
ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మెగా ఈవెంట్ బరిలోకి
లాహోర్: వచ్చే నెలలో భారత్–శ్రీలంక వేదికగా జరిగే పురుషుల టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్టాన్ జట్టును ఆదివారం ప్రకటించారు. 15 మంది సభ్యుల పాక్ జట్టుకు సల్మాన్ అలీ ఆఘా నాయకత్వం వహిస్తాడు. గతేడాది ఆసియా కప్ ఫైనల్ ఆడిన పేసర్ హరీస్ రవూఫ్‌పై సెలక్టర్లు వేటు వేయడం గమనార్హం. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన బిగ్‌బాష్ టి20 లీగ్‌లో హరీస్ రవూఫ్ 20 వికెట్లతో లీగ్ ‘టాపర్’గా నిలిచాడు.
అంతేకాకుండా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (94 మ్యాచ్‌ల్లో 133 వికెట్లు) తీసిన పాక్ బౌలర్‌గానూ గుర్తింపు పొందాడు. ‘పాక్ తరఫున రవూఫ్ చాలా క్రికెట్ ఆడాడు. శ్రీలంకలో పిచ్ పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేశాం’ అని వివరించాడు. మెగా టోర్నీలో ఆడటం, ఆడకపోవడం అనేది పాక్ ప్రభుత్వం చూసుకుంటుందని జావేద్ అన్నాడు.
బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్ నుంచి తప్పించగానే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ తమ దేశ ప్రధానమంత్రి అదేశాల మేరకే నడుచుకుంటామని, ఐసీసీ ప్రకారం కాదని చెప్పారు. పాక్ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఈ మెగా ఈవెంట్‌లో పాక్ ఆడుతుందని నఖ్వీ తెలిపారు. ఆతిథ్య భారత్ ఉన్న గ్రూప్ ‘ఎ’లో పాకిస్తాన్ ఉంది. ఇందులో నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా ఇతర జట్లు. వచ్చేనెల 7 నుంచి జరిగే ప్రపంచకప్‌లో పాక్, నెదర్లాండ్స్‌ల మధ్యే తొలి మ్యాచ్ జరుగనుంది.
పాకిస్తాన్ టి20 జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్ ), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నాఫే, మొహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీఖ్.


