న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ జట్టులో మార్పు
కరాచీ: పాకిస్తాన్ సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరిగే టి20 సిరీస్ కోసం షాహిన్ అఫ్రిదిని ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకోవడంతో అతనికి ఎప్పట్లాగే రెగ్యులర్ జట్టులో చోటు ఇచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా ఇటీవల శ్రీలంకతో ఆడిన పాకిస్తాన్ జట్టే... త్వరలో
ఆస్ట్రేలియాతోనూ మూడు టి20ల ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడుతుంది.
ఆ్రస్టేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ఆడిన బాబర్ ఆజమ్ కూడా పాక్ జట్టులోకి వచ్చాడు. భారత్, శ్రీలంకలో జరగబోయే మెగా ఈవెంట్‌కు ముందు పాక్, ఆసీస్‌లకు ఇది చివరి సన్నాహక టోర్నీ! 3 మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియమే ఆతిథ్యమిస్తుంది. ఈ నెల 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఆస్ట్రేలియా ఈ నెల 28న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది.
పాకిస్తాన్ జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెపె్టన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్, మొహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ వసీమ్, నసీమ్ షా, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్.


