breaking news
T20I cricket series
-
పాక్ టి20 జట్టులో షాహిన్, బాబర్
కరాచీ: పాకిస్తాన్ సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరిగే టి20 సిరీస్ కోసం షాహిన్ అఫ్రిదిని ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకోవడంతో అతనికి ఎప్పట్లాగే రెగ్యులర్ జట్టులో చోటు ఇచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా ఇటీవల శ్రీలంకతో ఆడిన పాకిస్తాన్ జట్టే... త్వరలో ఆస్ట్రేలియాతోనూ మూడు టి20ల ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడుతుంది. ఆ్రస్టేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ఆడిన బాబర్ ఆజమ్ కూడా పాక్ జట్టులోకి వచ్చాడు. భారత్, శ్రీలంకలో జరగబోయే మెగా ఈవెంట్‌కు ముందు పాక్, ఆసీస్‌లకు ఇది చివరి సన్నాహక టోర్నీ! 3 మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియమే ఆతిథ్యమిస్తుంది. ఈ నెల 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఆస్ట్రేలియా ఈ నెల 28న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. పాకిస్తాన్ జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెపె్టన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్, మొహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ వసీమ్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్. -
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో పెను సంచలనం
-
పాక్ ఆశలపై నీళ్లు..
లాహోర్: సొంత గడ్డపై పెద్ద జట్టుతో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించి అంతర్జాతీయంగా పరువు దక్కించుకుందామనుకున్న పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది! పాకిస్థాన్‌లో టీ20 సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు నో చెప్పింది. విండీస్.. పాక్ పర్యటనకు రావడంలేదన్న విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ షహర్యార్ ఖాన్ శనివారం మీడియాకు వెల్లడించారు. భద్రతాపరమైన కారణాలల వల్లే విండీస్ ప్లేయర్లు పాక్‌లో పర్యటించేందుకు విముఖత చూపారని ఖాన్ తెలిపారు. పాక్-విండీస్‌ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను నిర్వహించాలని పీసీబీ చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. ఒక దశలో విండీస్ క్రికెట్ బోర్డుకూడా సిరీస్‌కు సై అంది. అయితే విండీస్ ఆటగాళ్ల సంఘం మాత్రం పాక్‌లో మ్యాచ్‌లు ఆడబోమని బోర్డుకు తేల్చిచెప్పారు. దీంతో విండీస్‌బోర్డు పాక్‌కు తన నిస్సహాయతను తెలిపింది. ఇక చేసేదేమీలేక ‘పర్యటన ఉండదు’అని పీసీబీ చీఫ్ ప్రకటించారు. 2009లో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్‌లో ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి విదేశీ జట్లు పాక్ పర్యటనకు వెళ్లడంలేదు. కాగా, చిన్నజట్టైన జింబాబ్వే మాత్రం గత ఏడాది పాక్‌గడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. అదే ఊపులో విండీస్ లాంటి పెద్ద జట్లుతో మ్యాచ్‌లు నిర్వహించాలని ఆశించి, భంగపడింది. ఇదిలాఉంటే, శ్రీలంకపై దాడి జరిగిన లాహోర్‌లోనే.. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఫైనల్ మ్యాచ్(మార్చి 8న) నిర్వహించాలని, తద్వారా అంతర్జాతీయంగా క్రికెట్ జట్లలో నెలకొన్న ‘పాక్ భయాన్ని’ పోగొట్టాలని పీసీబీ భావిస్తోంది. జనవరి 28 నుంచి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ గిలెస్ క్లార్క్ పాక్‌లోని క్రికెట్ స్టేడియంలను సందర్శించనున్నారని, భద్రతా ప్రమాణాలపై ఆయన వెల్లడించే అభిప్రాయం తమకు ఎంతగానో లాభిస్తుందని పీసీబీ చీఫ్ ఖాన్ అన్నారు.


