టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా | Pakistan to host australia before T20 world cup | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా

Jan 15 2026 12:12 PM | Updated on Jan 15 2026 12:43 PM

Pakistan to host australia before T20 world cup

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆసీస్‌-పాక్‌ మూడు టీ20లు ఆడనున్నాయి. ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఇరు జట్లకు ఈ సిరీస్‌ ఉపయోగపడుతుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న లాహోర్‌కు చేరుకుంటుంది. జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రపంచకప్‌లో పాల్గొనే ఆసీస్‌ జట్టే ఈ సిరీస్‌లోనూ కొనసాగనుంది. ప్రపంచకప్‌ కోసం పాక్‌ జట్టును ప్రకటించాల్సి ఉంది.

ఆస్ట్రేలియా జట్టు 2022 మార్చిలో చివరిసారిగా పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ పర్యటనలో టెస్ట్‌, టీ20 సిరీస్‌లను ఆసీస్‌ గెలుచుకోగా.. వన్డే సిరీస్‌ను పాకిస్తాన్‌ కైవసం చేసుకుంది.

కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 భారత్‌, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8 వరకు సాగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీపడుతున్నాయి. పాకిస్తాన్‌.. టీమిండియాతో పాటు గ్రూప్‌-ఏలో ఉండగా.. ఆ జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. ఆస్ట్రేలియా గ్రూప్‌-బిలో ఉంది. పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement