
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వివాదంలో భాగంగా ఆ కేసును విచారించే జడ్డిల కమిటీకి సహాయం చేయడానికి న్యాయవాది కరణ్ ఉమేష్ సాల్వి కన్సల్టెంట్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా.. ఉమేష్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జస్టిస్ వర్మపై అభిశంసన ప్రక్రియలను ప్రారంభించడానికి లోక్‌సభలో మద్దతు ఇచ్చిన తీర్మానం తర్వాత ఈ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా సదర కమిటీకి న్యాయ సహాయం అందించడానికి కరణ్ ఉమేష్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.
జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలన్న ప్రతిపాదనపై ఆగస్టు నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 146 మంది ఎంపీలు సంతకాలు చేశారు. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జిల ప్యానల్‌ను నియమించగా, తాజాగా కరణ్ ఉమేవ్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమించారు.
ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ శ్రీవాస్తవ్, సీనియర్ న్యాయవాది బి.వి. ఆచార్యలు సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చదవండి:
పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్‌లతో తక్షణ చర్యలు