8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ రద్దు! | Lok Sabha to Lift Suspension of Eight Opposition MPs | Sakshi
Sakshi News home page

8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ రద్దు!

Mar 17 2026 5:30 AM | Updated on Mar 17 2026 5:30 AM

Lok Sabha to Lift Suspension of Eight Opposition MPs

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ తొలి దఫా సమావేశాల వేళ లోక్‌సభలో సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారన్న కారణంగా ఫిబ్రవరి మూడో తేదీన సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను మోదీ సర్కార్‌ రద్దుచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. సస్పెన్షన్‌ను మంగళవారం ఎత్తేయనున్నట్లు సమాచారం.

సీపీఐ(ఎం) ఎంపీ ఎస్‌.వెంకటేసన్‌తోపాటు ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులు గుర్జీత్‌ సింగ్‌ ఔజ్లా, హిబీ ఈడెన్, సీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్, మాణిక్యం ఠాకూర్, ప్రశాంత్‌ పదోలే, డియాన్‌ కురియన్‌కోసేలపై ఏప్రిల్‌ రెండో తేదీదాకా ఉన్న సస్పెన్షన్‌ వేటును తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో నిర్ణ యించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెండో దఫా బడ్జెట్‌ సమావేశాల్లో వీళ్లపై సస్పెన్షన్‌ను రద్దుచేయాలంటూ విపక్షనేతలు డిమాండ్‌ చేయడంతో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement